-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh telangana national and international latest news andhra jyothy news on 28th march 2025 Amar
-

Earthquake Video: పలు దేశాల్లో భూప్రకంపనలు.. 12 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు.. భారీ ప్రాణ నష్టం
ABN , First Publish Date - Mar 28 , 2025 | 09:31 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-28T14:34:07+05:30
రైల్వే, మెట్రో సేవల నిలిపివేత
బ్యాంకాంక్‌లో రైల్వే, మెట్రో సేవల నిలిపివేత
భూకంపం రీత్యా సేవలు నిలిపివేసిన ప్రభుత్వం
-
2025-03-28T14:28:04+05:30
పలు దేశాల్లో భూప్రకపంనలు
ప్రపంచంలోని పలు దేశాలకు తాకిన భూప్రకంపనలు
మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, చైనా, భారత్‌లో భూకంపం
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి
కోల్‌కతా, మణిపూర్, మేఘాలయలో భూప్రకంపనలు
-
2025-03-28T13:52:42+05:30
బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి
భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
అత్యవసర పరిస్థితి ప్రకటించిన థాయిలాండ్ ప్రధాని
కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనాలు
భారీ ఆస్తినష్టం
-
2025-03-28T13:39:56+05:30
భారత్‌లోనూ భూప్రకంపనలు
ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం
మణిపూర్, మేఘాలయలో స్వల్ప ప్రకంపనలు
-
2025-03-28T13:36:47+05:30
మయన్మార్‌లో అతలాకుతలం
భూకంపం ధాటికి మయన్మార్‌లో అతలాకుతలం
మండలే నగరంలో విధ్వంసం
డజన్ల కొద్దీ కూలిన భవనాలు
ఇరావడీ నదిపై కూలిన అవా వంతెన
-
2025-03-28T13:36:46+05:30
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనం
భూప్రకంపనలకు బ్యాంకాక్‌లో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం
-
2025-03-28T13:31:58+05:30
బ్యాంకాక్‌లో భారీ భూప్రకంపనలు
బ్యాంకాంక్‌లో భూకంపం
భయంతో జనం పరుగుుల
-
2025-03-28T13:25:10+05:30
భారీ భూకంపం
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం
మయన్మార్‌లో 7.7, బ్యాంకాక్‌లో 7.3గా రిక్టర్ స్కేల్‌పై నమోదు
కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనాలు
భారీ ఆస్తి నష్టం
భయంతో పరుగులు తీసిన జనం
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
అత్యవసర సమావేశానికి మయన్మార్ ప్రధాని పిలుపు
-
2025-03-28T12:59:53+05:30
మద్రాస్ ఐఐటీలో సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ రావడానికి ఎంతో ప్రయత్నించాం
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో తెలుగు మూలాలున్న వ్యక్తి
గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం
ప్రస్తుతం పరిస్థితులు మారాయి
భారత్‌కు ఆధార్ చాలా కీలకంగా మారింది
ఆధార్ ద్వారా అసలు వ్యక్తిని నిర్ధారించగలుగుతున్నాం
యూపీఐ కూడా డిజిటల్ సేవల్లో కీలకంగా మారింది
చిన్న ప్రయత్నం పెద్ద మార్పులకు కారణమైంది
ఆర్థిక సంస్కరణలతో భారత్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోంది
ఐఐటీ మద్రాస్ అనేక అంశాల్లో ముందువరుసలో ఉంది
-
2025-03-28T12:54:43+05:30
ఎన్నికల అధికారికి గుండెపోటు
ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ కార్యాలయం లో ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వ హిస్తున్న ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండె పోటు
అంబులెన్స్‌లో ప్రొద్దుటూ రులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
-
2025-03-28T12:52:39+05:30
చెన్నైలో సీఎం చంద్రబాబు పర్యటన
చెన్నైలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఐఐటీ మద్రాస్‌లో AIRSS-2025 సదస్సు
AIRSS-2025 సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు
యువత కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి
చెన్నై ఐఐటీలో 25 నుంచి 30 శాతం మంది తెలుగువాళ్లున్నారు
గతంలో దేశంలో అవకాశాలు తక్కువ ఉండేవి
దీంతో ఐఐటీలో చదివేవాళ్లు, డాక్టర్లు విదేశాలకు వెళ్లేవాళ్లు
ప్రస్తుతం పరిస్థితులు మారాయి
-
2025-03-28T12:45:51+05:30
ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
ఏప్రిల్ 27న లక్షలాది మందితో బీఆర్ఎస్ ఆవిర్భావ భారీ బహిరంగ సభ
మరొక కుంభమేళా మాదిరి బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది
బీఆర్ఎస్ బహిరంగ సభకు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు తరలిరాబోతున్నారు
బీఆర్ఎస్ సభ కోసం 10లక్షల వాటర్ ప్యాకెట్స్, 15లక్షల మజ్జిగ ఫ్యాకెట్స్ రెడీ చేస్తున్నాం
బీఆర్ఎస్ అంటే 25సంవత్సరాల తెలంగాణ చరిత్ర
చట్ట సభల్లో అయినా, బయట అయినా బీఆర్ఎస్ ప్రజల తరపున పోరాటం చేస్తోంది
హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే మరొక ఉద్యమం తప్పదు
-
2025-03-28T12:31:28+05:30
మయన్మార్‌లో భూకంపం
రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు
మయన్మార్ వ్యాప్తంగా భూప్రకంపనలు
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంప కేంద్రం అక్షాంశం: 21.93 N, పొడవు: 96.07 E వద్ద 10 కిలోమీటర్ల లోతు
ఈనెల మొదటి వారంలోనూ మయన్మార్‌లో భూకంపం
ఈనెల మొదటి వారంలో రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
నెలలో రెండోసారి భూప్రకంపనలు
-
2025-03-28T12:05:02+05:30
మావోయిస్టులు సంచలన లేఖ విడుదల
మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖ విడుదల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో జనవరి నుండి ఇప్పటి వరకు మావోయిస్టులు, ఆదివాసీలను కలిపి 78 మందిని హతమార్చారు
ఈ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా బంద్ కు పిలుపు
దండాకారణ్యంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టి ఆదివాసీలను ఖాళీ చేయించడమే కగార్ లక్ష్యమని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు
కగార్ హింస కాండను వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
-
2025-03-28T10:51:57+05:30
చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
హనుమకొండ విద్యారణ్యపురిలో ఓఇంట్లో ముసుగులతో చొరబడిన ఆరుగురు దొంగలు
కత్తులతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు
చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్న పోలీసులు
-
2025-03-28T10:39:28+05:30
వరంగల్‌లోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ
వరంగల్‌లోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ
ఫైనల్ చేసిన కేసీఆర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న సభ నిర్వహణ
ఎల్కతుర్తిలో సభా స్థలిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
కాసేపట్లో అధికారికంగా వెల్లడించనున్న బీఆర్ఎస్
-
2025-03-28T09:31:57+05:30
దేవాదుల పైప్ లైన్ లీక్
ధర్మసాగర్ మండలం సాయిపేటలో దేవాదుల పైప్ లైన్ లీక్
వృథాగా పోతున్న నీరు
పైప్‌లైన్‌పై ఒత్తిడి వల్లే లీకైందన్న అధికారులు