Share News

ఉపాధి హామీ పనుల్లో మేత

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:56 PM

గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉపాధి హామీ పథకం ఆసరాగా ఉంది. ఈ పథకాన్ని కొంతమంది అక్రమార్కులు అనుకూలంగా మార్చుకుని మేత మేసేస్తున్నారు.

ఉపాధి హామీ పనుల్లో మేత
ఉపాధి పనులపై ఆరా తీస్తున్న అధికారులు

పెదవేగి సామాజిక తనిఖీలో బయటపడ్డ అవినీతి

పెదవేగి, మార్చి 27(ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉపాధి హామీ పథకం ఆసరాగా ఉంది. ఈ పథకాన్ని కొంతమంది అక్రమార్కులు అనుకూలంగా మార్చుకుని మేత మేసేస్తున్నారు. మండలంలో 2023– 24 ఆర్దిక సంవత్సరంలో రూ.23 కోట్ల ఉపాధిపనులు జరిగాయి. మండలంలోని 30 గ్రామాల్లో వారం రోజులుగా అధికారులు తనిఖీ నిర్వహించారు. పనికి ఎంతమంది వచ్చారు, మస్తరు నమోదుపై విచారణ జరిపారు. గ్రామాల్లో విచారణ అనంత రం మండల పరిషత్‌ కార్యాలయంలో గురు వారం ఏర్పాటు చేసిన మండల స్థాయి సామా జిక తనిఖీ సమావేశంలో గ్రామాల్లో నిర్వహించిన అంశాలను చదివి వినిపించారు. అత్యధిక గ్రామాల్లో ఉపాధి పనులు పక్కదారి పట్టినట్లు తేల్చారు. భోగాపురంలో 18పాత ఇళ్లను కొత్తగా కట్టినట్లు చూపించి, రూ.3లక్షలు చెల్లింపులు చేశారు. రూ.9లక్షలకు సంబంధించిన మస్తర్లపై వేతనదా రులు కాకుండా మేట్‌ ఒక్కరే సంతకాలు చేశా రు. ఇదే విషయాన్ని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అంగీకరిం చడం గమనార్హం. లక్ష్మీపురంలో పనికి వెళ్లని వారు, గ్రామంలోని వారి పేర్లతో బినామీ మస్త ర్లు వేసి సొమ్ము లాగేసుకున్నారు. చెరువులో పని చేయకుండా చేసినట్లు రికార్డు చేసి, రూ.10 లక్షలు కాజేశారు. తాళ్లగోకవరంలో చనిపోయిన 14మంది పనికి వచ్చినట్లు మస్తరు వేసి, సొమ్ము కూడా చెల్లించేశారు. చాలాగ్రామాల్లో నిధులు లక్షల్లో స్వాహా చేశారు. పక్కదారి పట్టిన నిధులను బాధ్యుల నుంచి తిరిగి రాబడతామని అధికారులు తెలిపారు. విజిలెన్స్‌ ఏపీడీ పురు షోత్తం, ఎస్‌ఆర్పీ సూర్య, ఎంపీడీవో పి.శ్రీనివాస్‌, ఏపీవో హేమలత, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బృందం పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:56 PM