Share News

Twists in AP Politics: వైసీపీ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి నీతి కబుర్లా

ABN , Publish Date - Mar 28 , 2025 | 09:18 AM

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోకుండా పోటీ చేసే అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుండటం, కిడ్నాప్‌లు చేస్తున్నారనే ఆరోపణలతో కార్యకర్తలను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశంగా చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో వైసీపీకి చెందిన అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు.

Twists in AP Politics: వైసీపీ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి నీతి కబుర్లా
YSRCP

ప్రజల మద్దతు తమకు లేదని తెలిసినా వైసీపీ ఓవర్ యాక్షన్ చేస్తుందా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి భయపడిన ఆ పార్టీ తమకు బలముండి గెలిచిన ఎంపీపీ, వైస్ ఎంపీపీల గురించి ఎక్కువుగా ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో వివిధ కారణాల రీత్యా ఒక జిల్లా పరిషత్తు ఛైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి స్థానిక సంస్థల్లో పార్టీ బలాబలాల ఆధారంగా ఎంపీటీసీలు ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలను నేరుగా ప్రజలు ఓటు వేసి ఎన్నుకోరు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీటీసీలు మాత్రమే వీరిని ఎన్నుకుంటారు.


2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోకుండా పోటీ చేసే అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుండటం, కిడ్నాప్‌లు చేస్తున్నారనే ఆరోపణలతో కార్యకర్తలను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశంగా చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో వైసీపీకి చెందిన అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండటంతో అప్పట్లో ఎన్నికైన ఎంపీటీసీలే ప్రస్తుతం ఉన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల బలం ఆధారంగా వైసీపీ అన్ని స్థానాలను గెలుచుకోవల్సి ఉంటుంది. కానీ కొన్ని పదవులను కోల్పోవలసి వచ్చిది. కారణం ఆ పార్టీ నాయకులకు వైసీపీపై నమ్మకం లేకపోవడమే కారణం. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలవాల్సిన తాము ఎందుకు ఓడిపోయామనే ఆత్మపరిశీలన చేసుకోకుండా తాము ఏదో సాధించామనే రీతిలో వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడంపై ఆ పార్టీ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా అనే చర్చ సాగుతోంది.


ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపోటములే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మరో ఏడాదిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందుతుందే తేలిపోతుంది. అప్పటివరకు ఆగకుండా తమకు సంఖ్యాబలం సంపూర్ణంగా ఉన్న స్థానాల్లో గెలిచి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రెండు పట్టభద్రలు, ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. లక్షలాదిమంది యువత, చదువుకున్న వారు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతే పరువు పోతుందనే ఆలోచనతోనే వైసీపీ పోటీకి దూరంగా ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు పలికింది. వైసీపీ మద్దతు తెలిపిన పీడీపీ అభ్యర్థులు మూడు స్థానాల్లో ఓడిపోయారు. వైసీపీ కారణంగానే పీడీఎఫ్ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. వాస్తవాలు ఓ రకంగా ఉంటే వైసీపీ మాత్రం మరొక రకంగా ప్రచారం చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?

పుష్కరాల్లోపే పోలవరం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latet Telugu News Click Here

Updated Date - Mar 28 , 2025 | 09:18 AM