Duvvada Srinivas: నరకం చూపిస్తా.. నాయాలా!
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:24 AM
విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో, టెక్కలి ట్రాన్స్‌కో అధికారులు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ కనెక్షన్ తాత్కాలికంగా తొలగించారు. రెచ్చిపోయిన ఎమ్మెల్సీ, సంబంధిత అధికారిని ఫోన్‌లో తీవ్రంగా బెదిరించారు. అనంతరం బకాయి మొత్తాన్ని చెల్లించినప్పటికీ, ఈ ఘటనపై ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది.

టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా
ఎమ్మెల్సీ ఇంటికొచ్చి కనెక్షన్ కట్ చేశావంటే ఎంత ధైర్యం
నిన్ను కోర్టుకు లాగుతా.. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో
ట్రాన్స్‌కో జేఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు
బిల్లు చెల్లించనందుకు విద్యుత్తు కనెక్షన్ తొలగించారని నోటి దురుసు
శ్రీకాకుళం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘నరకం చూపిస్తా.. నాయాలా’ అంటూ ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కువరంలో దువ్వాడ పేరుతో విద్యుత్ కనెక్షన్ ఉంది. అదే ఇంటికి అతని సన్నిహితురాలి పేరుతో మరో కనెక్షన్ ఉంది. శ్రీనివాస్ పేరుతో ఉన్న కనెక్షన్‌కు రూ.56,692 బకాయిలు గడువు తీరినా చెల్లించలేదు. దీంతో ఈ కనెక్షన్‌తో పాటు అదే ఇంటికి అనుబంధంగా ఉన్న కనెక్షన్‌ను అధికారులు శుక్రవారం తాత్కాలికంగా తొలగించారు. విషయం తెలుసుకున్న దువ్వాడ.. టెక్కలి ట్రాన్స్‌కో జేఈకి ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. ‘‘ఎలా కట్ చేస్తారు.. నా ఇంటికి వచ్చి.. కొంచెమైనా లెక్కలు పత్రాలు ఉన్నాయా? ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కట్ చేశావంటే నీకు ఎంత ధైర్యమబ్బా? టెక్కలిలోనే ఎన్ని రైస్‌మిల్లులు ఉన్నాయి. దమ్ముంటే వెళ్లి కట్ చేయిు. ఎవరితో పెట్టుకుంటున్నావు.. బిల్లు కట్టినా ఎలా కట్ చేస్తావు.. నువ్వు ఏ రైట్స్‌తో కట్ చేశావో చెప్పు. నీపై కంజ్యూమర్ కోర్టుకు వెళ్తా... కోర్టుకి లాగి నీ జీవితం ఈడ్చిఈడ్చి పెడతా. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి డి.
మాధురి పేరున ఉన్న బిల్లు పేమెంట్ జరిగి వారం రోజులైంది. నిన్ను కోర్టుకు లాగుతా. నీకు నరకం చూపుతా. నువ్వు ఏదో తెలుగుదేశం వాడివి అయ్యుండొచ్చు. ఎంత ధైర్యంతో నా ఇంటికి వచ్చావు. నువ్వు పారిపోయేట్లు చేస్తాను చూడు. టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా... నాయాలా’ అంటూ దువ్వాడ శ్రీను బెదిరించారు. అనంతరం దువ్వాడ బకాయి మొత్తాన్ని చెల్లించి రశీదును వాట్సా్‌పలో పంపారు. దీనిపై ట్రాన్స్‌కో జేఈ దాసరి మురళీకృష్ణ మాట్లాడుతూ సర్వీ్‌సకు సంబంధించి బిల్లు మొత్తం చెల్లించేశారని, విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించామని తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ, జేఈ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..