Share News

Customer dissatisfaction survey: భారతీయ వినియోగదారుల వెతలు.. కస్టమర్‌కేర్‌లో ఫిర్యాదులకు 1500 కోట్ల గంటలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 09:57 AM

కస్టమర్‌కేర్‌లో ఫిర్యాదుల కోసం భారత దేశంలో వినియోగదారులు గతడేది 1500 కోట్ల గంటల సమయం వెచ్చించారని తాజాగా ఓ సర్వే తేల్చింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Customer dissatisfaction survey: భారతీయ వినియోగదారుల వెతలు.. కస్టమర్‌కేర్‌లో ఫిర్యాదులకు 1500 కోట్ల గంటలు
Customer dissatisfaction survey

ఇంటర్నెట్ డెస్క్: మీకు ఫోన్ కనెక్షన్ ఉందా? ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? సేవాలోపం ఎదురైనప్పుడు ఫిర్యాదులు చేసేందుకు గంటల కొద్దీ సమయం వెచ్చించి విసిగిపోతున్నారా? భారతీయుల్లో అధిక శాతం మంది కస్టమర్లు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఓ సర్వే తాజాగా తేల్చింది. ఒకప్పటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడినా కస్టమర్ కేర్ ఫిర్యాదులపై వృథా అవుతున్న సమయం భారీగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.

సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రిపోర్టు పేరిట ఈ నివేదిక విడుదలైంది. ఫిర్యాదులు చేసేటప్పుడు కస్టమర్ల సమయం ఎంతగా వృథా అవుతోందో ఈ సర్వే చెప్పింది. మొత్తం 5 వేల మంది భారతీయ వినియోగదారులు, 204 మంది కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక సిద్ధం చేశారు.

Also Read: గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌కు కేంద్రం స్వస్తి


నివేదికలోని వివరాల ప్రకారం, దేశంలోని దాదాపు 80 శాతం మంది వినియోగదారులు.. సేవాలోపాలపై ఫిర్యాదు చేసేందుకు, ఉత్పత్తుల కొనుగోలుపై సలహాలు, ఫిర్యాదుల స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఏఐ చాట్‌బాట్స్‌పై ఆధారపడుతున్నారు. అయినా కానీ, జనాలు గతేడాది ఫిర్యాదులు చేసేందుకు మొత్తం 1500 కోట్ల గంటల సమయం వెచ్చించాల్సి వస్తోందట.

అయితే, గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరగైందని కూడా సర్వే నిర్ధారించింది. ఫిర్యాదుల పరిష్కారానికి వేచి చూడాల్సిన సమయం మునుపటితో పోలిస్తే 3.2 గంటల మేర తగ్గిందని సర్వే తేల్చింది. కస్టమర్‌కేర్‌లో ఏం జరుగుతోందో తెలీక పోవడం వినియోగదారుల అసంతృప్తికి కారణమవుతోంది.


Also Read: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

ఫిర్యాదులు చేసే సమయంలో సగటున 39 శాతం మంది వినియోగదారుల ఫోన్ కాల్స్‌ను సంస్థలు హోల్డ్‌లో పెట్టి వేచి చూసేలా చేస్తున్నాయి. మరో 39 శాతం మంది తమ కాల్స్ ఇతర విభాగాలకు బదిలీ అవుతున్నాయని చెప్పారు. ఫిర్యాదుల ప్రక్రియను సంస్థలు కావాలనే సంక్లిష్టంగా మారుస్తున్నాయని తాము నమ్ముతున్నట్టు 34 శాతం మంది పేర్కొన్నారు. ఫలితంగా కస్టమర్లలో సహనం నశిస్తోంది. కస్టమర్‌కేర్ సర్వీసు సరిగా లేకపోతే తాము మరో సంస్థకు మళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు రాసేందుకు వెనకాడబోమని 84 శాంతి మంది తేల్చి చెప్పారు.

Read latest and Business News

Updated Date - Mar 26 , 2025 | 11:36 AM