Share News

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌.. కొత్త నిబంధనలు?

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:29 AM

ముంబై కేంద్రంగా ఉన్న ఒక ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల కంపెనీకి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాఖలు ఉన్నాయనుకుందాం. ఆ కంపెనీ తన శాఖలలోని అకౌంట్స్‌ను మెరుగుపరచటానికి ఒక సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను...

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌..  కొత్త నిబంధనలు?

ముంబై కేంద్రంగా ఉన్న ఒక ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల కంపెనీకి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాఖలు ఉన్నాయనుకుందాం. ఆ కంపెనీ తన శాఖలలోని అకౌంట్స్‌ను మెరుగుపరచటానికి ఒక సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను అన్ని శాఖలకు పంపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ముంబైలోని ఒక టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేశారనుకుందాం. ఇది రాష్ట్ర అంతర్గత సరఫరా కాబట్టి కొనుగోలు సమయంలో దీని మీద సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ చెల్లించింది. దీనిపై క్రెడిట్‌ తీసుకునే సమయంలో రెండు సమస్యలు వస్తాయి. మొదటిది.. ఇది ఏ ఒక్క శాఖకు పరిమితమైనది కాదు కాబట్టి ఇన్వాయిస్‌ ఏదైనా ఒక శాఖ పేరు మీద ఇస్తే మిగతా వాటికి క్రెడిట్‌ తీసుకునే అర్హత ఉండదు. అలాగే చెల్లించిన పన్ను మహారాష్ట్రకు సంబంధించిన సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ కాబట్టి వేరే రాష్ట్రంలో చెల్లుబాటు కాదు. దీనికి సమాధానమే ‘ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌’ (ఐఎ్‌సడీ). ఐఎ్‌సడీ అనేది సర్వీసులకు సంబంధించి పొందిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను వివిధ శాఖలకు పంచడానికి ఉపకరిస్తుంది. ఒక వ్యాపార సంస్థ మామూలు జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేకుండా ఐఎ్‌సడీ కింద విడిగా రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. సాధారణంగా హెడ్‌ ఆఫీస్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ తీసుకుంటారు. అయితే ఈ ఐఎ్‌సడీ విధానం, దీనికి సంబంధించిన విధి, విధానాలు వ్యాపార వర్గాలకు కొత్తేమీ కాదు. ఈ విధానాన్ని వివిధ వ్యాపార వర్గాలు ఇప్పటికే ఉపయోగించుకుంటుండగా.. ప్రభుత్వం కొత్తగా ఈ విధానంలో కొన్ని మార్పులు చేసింది. ఆ వివరాలు మీ కోసం.


ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐఎ్‌సడీ రిజిస్ట్రేషన్‌ అనేది తప్పనిసరి కాదు. వ్యాపార వర్గాలు తమ సౌలభ్యం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ, కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ఏదేనీ కంపెనీకి లేదా సంస్థ ఒకే పాన్‌ సంఖ్యతో ఒకటికి మించి రిజిస్ట్రేషన్స్‌ ఉంటే ఆ సంస్థ ఐఎ్‌సడీ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ పొందాలి. జీఎ్‌సటీ నియమావళి ప్రకారం ఒక సంస్థ ఎన్ని రాష్ట్రాల్లో ఆఫీ్‌సలు, లేదా శాఖలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. ఇలా ఒకే పాన్‌ సంఖ్యతో రిజిస్ట్రేషన్‌ పొందిన వాటిని జీఎ్‌సటీ పరి భాషలో ‘డిస్టింక్ట్‌ పర్సన్స్‌’ అంటారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం ఇలాంటి వ్యాపార సంస్థలు అన్ని కచ్చితంగా ఐఎ్‌సడీ కింద రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. అలాగే కామన్‌గా ఉపయోగించే సర్వీసులు అన్ని తప్పనిసరిగా ఐఎ్‌సడీ పేరు మీదే పొందాలి. ఇక ఈ ఐఎ్‌సడీ, తన పేరు మీద వచ్చిన ఇన్వాయి్‌సలకు సంబంధించిన క్రెడిట్‌ను వివిధ శాఖలకు పంచవలసి ఉంటుంది. దీనికి ఒక పద్దతి ఉంది. పొందిన సర్వీస్‌, సంస్థకు సంబంధించిన ఏదైనా ఒక శాఖలో మాత్రమే వాడితే క్రెడిట్‌ మొత్తం ఆ శాఖకే బదిలీ చేయాలి. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ శాఖల్లో సర్వీ్‌సను వాడితే గత ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు వాటి సంబంధిత రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో జరిపిన టర్నోవర్‌ మీద ఆధారపడి అదే నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది (గత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కార్యకలాపాలు లేకుంటే గడిచిన త్రైమాసికం తీసుకోవాలి). ఇలా పంచే క్రెడిట్‌.. ఐజీఎ్‌సటీ అయితే అన్ని శాఖలకు ఐజీఎ్‌సటీ రూపంలోనే పంచాలి. అలాకాకుండా సీజీఎ్‌సటీ/ఎ్‌సజీఎస్‌టీ అయితే అదే రాష్ట్రంలోని శాఖలకు సీజీఎ్‌సటీ/ఎ్‌సజీఎ్‌సటీ రూపంలో పంచాలి. వేరే రాష్ట్రంలోని శాఖలకు ఐజీఎ్‌సటీ రూపంలో పంచాలి.


అంటే పైన చెప్పిన కంపెనీ ఉదాహరణగా తీసుకుంటే ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది కాబట్టి.. ఐఎ్‌సడీ రిజిస్ట్రేషన్‌ కూడా ముంబై ప్రధాన కార్యాలయం మీద తీసుకుని.. కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇన్వాయిస్‌ ఈ అడ్రస్‌ మీద తీసుకుందని అనుకుందాం. సరఫరాదారుడు కూడా ముంబైకి చెందిన వ్యక్తి అనుకుంటే, కొనుగోలు సమయంలో చెల్లించిన సీజీఎ్‌సటీ/ఎ్‌సజీఎ్‌సటీ మహారాష్ట్రలోని శాఖకు పంచేటప్పుడు సీజీఎ్‌సటీ/ఎ్‌సజీఎస్‌టీ రూపంలోనే పంచాలి (ఐఎ్‌సడీ, ఆ శాఖ రెండు మహారాష్ట్రలోనే ఉన్నాయి కాబట్టి). మహారాష్ట్ర వెలుపలి శాఖలకు పంచే క్రెడిట్‌ ఐజీఎ్‌సటీ రూపంలో పంచాలి. అలాగే వేరే ఏదేనీ రాష్ట్రంలోని శాఖకు రిజిస్ట్రేషన్‌ లేకున్నా.. ఆ మేర ఇతర శాఖలకు సర్దుబాటు చేయరాదు. ఇకపోతే ఈ ఐఎ్‌సడీ కొంతకాలం తర్వాత సరఫరాదారుని నుంచి క్రెడిట్‌ నోట్‌ లేదా డెబిట్‌ నోట్‌ పొంది క్రెడిట్‌ సర్దుబాటు చేయాల్సి వస్తే, ఆయా క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్స్‌ను కూడా క్రెడిట్‌ను ఏ నిష్పత్తిలో పంచారో అదే నిష్పత్తిలో వివిధ శాఖలకు పంచాల్సి ఉంటుంది.


అయితే పైన నియమ నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉండగా.. తప్పనిసరిగా ఐఎ్‌సడీ రిజిస్ట్రేషన్‌ పొందాలనే నిబంధన 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి:

Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 03:29 AM