Share News

సెబీ వద్ద నమోదైన ఫిన్‌ఫ్లుయెన్సర్లు 2 శాతమే: సీఎ్‌ఫఏ

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:25 AM

ఆన్‌లైన్‌లో స్టాక్‌ రికమెండేషన్స్‌తోపాటు ఇతర ఆర్థిక సలహాలిచ్చే ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఫిన్‌ఫ్లుయెన్సర్లు 2 శాతం మంది మాత్రమే సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకున్నారని...

సెబీ వద్ద నమోదైన ఫిన్‌ఫ్లుయెన్సర్లు 2 శాతమే: సీఎ్‌ఫఏ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో స్టాక్‌ రికమెండేషన్స్‌తోపాటు ఇతర ఆర్థిక సలహాలిచ్చే ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లలో (ఫిన్‌ఫ్లుయెన్సర్లు) 2 శాతం మంది మాత్రమే సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకున్నారని సీఎ్‌ఫఏ ఇన్‌స్టిట్యూట్‌ తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. కానీ, ఫిన్‌ఫ్లుయెన్సర్లలో 33 శాతం మంది ప్రత్యక్షంగా ఆయా కంపెనీల షేర్లను సిఫారసు చేస్తున్నారని తెలిపింది. వ్యక్తుల పెట్టుబడి నిర్ణయాలపై ఫిన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతుండటంపై ఆ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్‌ఫ్లుయెన్సర్లపై నియంత్రణ కొరవడిందని, వారిలో జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్నారు. 63 శాతం మంది ఫిన్‌ఫ్లుయెన్సర్లు తమ స్పాన్సర్ల వివరాలను, వారితో తమకున్న ఆర్థిక అనుబంధాన్ని పూర్తిగా బహిర్గతం చేయడం లేదని సీఎ్‌ఫఏ అధ్యయనంలో తేలింది. ఇది ఫిన్‌ఫ్లుయెన్సర్లు-స్పాన్సర్ల మధ్య పరస్పర ప్రయోజనాలున్నాయన్న సందేహాలకు తావివ్వడంతోపాటు ఇన్వెస్టర్లను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు రేకెత్తిస్తోందని సీఎ్‌ఫఏ అభిప్రాయపడింది.

Updated Date - Mar 25 , 2025 | 02:25 AM