Poonam Gupta: కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా గురించి తెలుసా..
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:58 PM
జనవరి నుంచి ఖాళీగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ పదవికి కొత్త వ్యక్తి వచ్చారు. తాజాగా ఈ పదవికి పూనమ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.

ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తా(Poonam Gupta)ను డిప్యూటీ గవర్నర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నియమించింది. 2025 ఏప్రిల్ 7-9 మధ్య జరగనున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ముందు గుప్తా నియామకం జరిగింది. ఈ సమావేశం ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతుంది. గుప్తా ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. గుప్తా ప్రస్తుతం NCAER (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
చదువు, పదవులు..
పూనమ్ గుప్తా 2021లో NCAERలో చేరారు, అక్కడ ఆమె దాదాపు 20 సంవత్సరాలు అమెరికాలోని IMF, ప్రపంచ బ్యాంకులో సేవలందించారు. పూనమ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ (US)లో బోధనతో పాటు ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI)లో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. NCAER వెబ్‌సైట్ ప్రకారం, పూనమ్ గుప్తా NIPFPలో RBI చైర్ ప్రొఫెసర్‌గా, ICRIERలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
ప్రధానమంత్రి మండలిలో
దీంతోపాటు పూనమ్ అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో PhD, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. అంతే కాకుండా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో ఆమె డాక్టరేట్ పరిశోధనకు EXIM బ్యాంక్ అవార్డును కూడా అందుకున్నారు. గుప్తా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలు. దీంతోపాటు 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్‌గా పనిచేస్తున్నారు.
జీతం ఎంత..
ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన మరో అంశం ఏంటంటే, భారతదేశం G20 అధ్యక్షత సమయంలో, ఆమె స్థూల ఆర్థిక శాస్త్రం, వాణిజ్యంపై టాస్క్ ఫోర్స్‌కు అధ్యక్షత వహించారు. అదేవిధంగా, పూనమ్ గుప్తా NITI ఆయోగ్ అభివృద్ధి సలహా కమిటీలో, FICCI కార్యనిర్వాహక కమిటీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూనమ్ గుప్తా, RBI డిప్యూటీ గవర్నర్ అయిన నేపథ్యంలో ఆమె జీతం నెలకు రూ. 2.25 లక్షలు లభిస్తుంది. ప్రస్తుతం, నలుగురు RBI డిప్యూటీ గవర్నర్‌లు ఉండగా, వారిలో పూనమ్ గుప్తా, స్వామినాథన్ J, T రబీ శంకర్, M రాజేశ్వర్ రావు కలరు.
ఇవి కూడా చదవండి:
Yashasvi Jaiswal: ముంబై జట్టుకు గుడ్ బాయ్ చెప్పిన యశస్వి జైస్వాల్..అసలేమైంది..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News

రూ.500, రూ.10 నోట్లకు సంబంధించి కీలక అప్డేట్..

మీరు ప్లాట్ కొంటున్నారా..ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..

5 రోజుల పెరుగుదలకు బ్రేక్..భారీగా తగ్గిన గోల్డ్ ధర..

ట్రంప్ సుంకాల దెబ్బ.. అమెరికా సంపన్నులకు షాక్

క్రెడిట్ కార్డు లేకున్నా క్రెడిట్ స్కోర్ పెంచుకునే చిట్కాలు..
