Share News

RBI Repo Rate: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:41 AM

RBI Repo Rate: ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది.

RBI Repo Rate: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ
RBI Repo Rate

ముంబై: ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.


సామాన్య ప్రజలకు ఊరట..

రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. 6.50 శాతం ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గించామన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది.


రెపో రేట్ల తగ్గింంపుపై సమర్థన

లోన్లపై ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. ఆర్‌బీఐ ఎంపీసీపై కూడా చాలా ఒత్తిడి ఉంది. గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని కొందరు సభ్యులు రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు. కానీ ఎక్కువ మంది సభ్యులు మాత్రం రెపో రేటును మార్చకుండా అలాగే ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచింది. అయితే సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెపో రేటులో సవరణలు చేస్తారని చాలామంది భావించినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Sailajanath.. వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ మంత్రి...

స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 12:01 PM