92,000 చేరువలో బంగారం
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:48 AM
బులియన్ మార్కెట్ రేసు గుర్రంలా పరిగెడుతోంది. బంగారం, వెండి ధరలు బుధవారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరో జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఢిల్లీలో...

న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ రేసు గుర్రంలా పరిగెడుతోంది. బంగారం, వెండి ధరలు బుధవారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరో జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం రూ.700 లాభంతో రూ.91,950కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో వెండి ధరా రూ.1,000 లాభంతో మరో ఆల్ టైమ్ హై రూ.1,03,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. బుఽధవారం ఒక దశలో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 3,045.39 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రధాన ఆసియా మార్కెట్లలో అయితే ఔన్స్ ధర ఇంట్రా డేలో 3,052.31 డాలర్లు పలికింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ పసిడి ధర 4,000 డాలర్లకు చేరుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే భారత మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.లక్షకు చేరుతుందని అంచనా.