Share News

కష్టకాలంలోనూ సైనిక దాడులా?

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:25 AM

పెను భూకంపం ధాటికి మయన్మార్ (బర్మా) కకావికలమైంది. రెండువేల మందికి పైగా మరణించినట్లు, మూడు వేల మంది క్షతగాత్రులైనట్టు లెక్క తేలినా, ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా అంచనాల ప్రకారం విగత జీవుల...

కష్టకాలంలోనూ సైనిక దాడులా?

పెను భూకంపం ధాటికి మయన్మార్ (బర్మా) కకావికలమైంది. రెండువేల మందికి పైగా మరణించినట్లు, మూడు వేల మంది క్షతగాత్రులైనట్టు లెక్క తేలినా, ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా అంచనాల ప్రకారం విగత జీవుల సంఖ్య కొన్ని వేలల్లో ఉండొచ్చు. అక్కడి రెండు పెద్ద నగరాలు కూలిన భవనాలు, నిర్మాణాలతో మట్టి దిబ్బలుగా మారినట్లు ఛాయాచిత్రాలు చెప్తున్నాయి. వెంటనే అక్కడ సహాయక చర్యలు అందించడానికి భారత్ ముందుకురావడం, 139 టన్నుల సహాయక సామగ్రి, పలు సహాయక బృందాలు, విపత్తు నిర్వహణా టీములు వెంటనే పనిలోకి దిగడం అభినందనీయం. అయితే ఇలాంటి విషాద సమయంలో కూడా అక్కడి సైనిక పాలకులు విపక్షీయులపై ఆయుధ దాడులు ఆపకపోవడం బాధాకరం. స్వంత దేశం కష్టాల్లో ఉన్నప్పుడు తమ శక్తిమేర సహాయక చర్యలు చేపట్టకుండా, సైనిక దాడులు చెయ్యడం వారికే చెల్లు. ఆ దేశం భూకంపాలకు నెలవు. అలాంటప్పుడు భూకంపాలకు తట్టుకునేలా, తక్కువ నష్టం కలిగించేలా నిర్మాణాలు ఉండాలి. జపాన్ తరహాలో నిబంధనల మేరకు నిర్మాణాలు జరిగితే వైపరీత్యాల వేళ తక్కువ ప్రాణ, ఆస్తి నష్టం ఉంటుంది. ఆ దేశంతో సహా, మిగతా దేశాలకు ఈ భూకంపం కనువిప్పు కలిగించాలి. ప్రకృతి వైపరీత్యం జరగకుండా ఎవరూ ఆపలేరు. కానీ, దాని నుంచి తక్కువ నష్టం కలిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. మయన్మార్‌కి వచ్చిన కష్టం బాధాకరం. వారి కన్నీరు తుడుస్తూనే, మనం కళ్లు తెరుద్దాం.

డి.వి.జి. శంకరరావు

ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:25 AM