Gas Problem: వేసవిలో గ్యాస్ సమస్య.. ఇలా చేస్తే చిటికలో రిలిఫ్
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:13 PM
పైన మండిపోతున్న ఎండలు.. కడుపులో రగిలిపోతున్న గ్యాస్.. నరకం చూడాల్సి వస్తుంది. కొన్ని సార్లు కొంచెం తిన్నా కూడా కడుపు మొత్తం తిండిపోతుంది. మరికొన్ని సార్లు కడుపులో నొప్పిగా ఉంటుంది.

ఎండాకాలం వచ్చిందంటే చాలు. గ్యాస్ సమస్య నేనున్నా అంటూ భయపెడుతుంది. తినాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ తిన్నా చాలు గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా గ్యాస్ సమస్య రావడానికి మనం తినే ఆహారం.. ఎలా తింటున్నాం.. ఎంత తింటున్నాం.. మన జీవన శైలి ప్రధాన కారణాలుగా మారతాయి. ధూమపానం, మద్యపానం, తినేటప్పుడు మాట్లాడటం.. చాలా త్వరగా తినడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు వస్తాయి. పొట్టలోకి చేరిన ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల.. జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది. అది బయటకు వెళ్లలేనంతగా జీర్ణవ్యవస్థలో పేరుకుపోతే గ్యాస్ సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. దాన్నే కడుపు ఉబ్బరం అంటారు. మరికొన్ని సార్లు కడుపు నొప్పిగా అనిపిస్తుంది. గ్యాస్ సమస్య తీవ్రమయితే.. పేగుల్లో అల్సర్లు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్ సమస్యనుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
మజ్జిగ
గ్యాస్ సమస్య ఉన్నవారికి మజ్జిగ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పల్చటి మజ్జిగ తాగటం వల్ల తక్కువ టైంలో రిలీఫ్ పొందొచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్
పొట్టలో ఏర్పడే ఎసిడిటీ నుంచి యాపిల్ సైడర్ వెనిగర్ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగండి. ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటిని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పుదీనా ఆకులు
పుదీనా ఆకులు గ్యాస్, అజీర్తి, ఉబ్బరం, కడుపు నొప్పి సమస్యల్ని తగ్గించడానికి అద్భుతంగా పని చేస్తాయి. ప్రతీ రోజూ ఉదయం లేవగానే పుదీనా ఆకుల్ని తినవచ్చు. లేదా పుదీనా టీ తాగినా కూడా గ్యాస్ సమస్య నుంచి తక్షణ విముక్తి లభిస్తుంది.
హెర్బల్ టీ
గ్యాస్ సమస్య ఉన్నవారికి కొన్ని సార్లు కడుపు నొప్పి కూడా ఉంటుంది. కడుపు నొప్పితో బాధపడేవారు. హెర్బల్ టీ తాగటం ఎంతో మేలు చేస్తుంది. మెంతులు, అల్లం, చామంతి, పుదీనా ఆకులు, తులసి వంటి వాటితో చేసిన హెర్బల్ టీలు తాగటం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.
మెంతులు
జర్ణీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించటంలో మెంతులు చాలా అద్భుతంగా పని చేస్తాయి. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. మెంతులు నానబెట్టుకుని తిన్నా.. నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి:
Guinness World Records: గిన్నిస్ రికార్డులో మేక.. ప్రత్యేక ఏంటో తెలుసా?
Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..