Women can hear better than men: వినికిడి సామర్థ్యం పురుషుల కంటే మహిళలకే ఎక్కువ
ABN , Publish Date - Mar 30 , 2025 | 09:11 PM
వినికిడి సామర్థ్యం పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఉన్నట్టు ఫ్రాన్స్‌కు చెందిన సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: వినికిడి శక్తి వయసును బట్టి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సామర్థ్యానికి స్త్రీపురుష బేధాలు ఉన్నట్టు కూడా తేలింది. ఫ్రాన్స్‌కు చెందిన సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లోని వారిపై అధ్యయనం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పలు సంస్కృతులు నేపథ్యాలకు చెందిన వారి వినికిడి శక్తిని అంచనా వేశారు.
ఎడమ చెవికంటే కుడి చెవికి వినికిడి శక్తి ఎక్కువ అని శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే గుర్తించారు. ఇక వయసుతో పాటు వినికిడి శక్తి తగ్గుతుందన్న విషయం కూడ అందరికీ అనుభవమే.
Also Read: బబుల్ గమ్‌తోనూ మైక్రో ప్లాస్టిక్స్ ముప్పు? తాజా అధ్యయనంలో వెల్లడి
తాజా అధ్యయనంలో స్త్రీపురుషల బేధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వయసు కంటే స్త్రీ పురుష బేధాలే వినికిడి శక్తిపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. అన్ని వయసుల కేటగిరీల్లో పురుషుల కంటే స్త్రీలకు పురుషుల కంటే రెండు డెసిబెల్స్ మేర ఎక్కువ శబ్దాలు వినే సామర్థ్యం ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.
ఇక పర్యావరణ ప్రభావం కూడా వినికిడి శక్తిపై ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లోని వారు వినికిడి శక్తి అత్యధికమని, వివిధ ఫ్రీక్వెన్సీల శబ్దాలను వారు గుర్తించగలిగినట్టు అధ్యయనకారులు పేర్కొన్నారు. ఇక ఎత్తైన ప్రాంతాల్లోని వారి వినికిడి సామర్థ్యం లోతట్టు ప్రాంతాల్లోని వారి కంటే తక్కువట.
Also Read: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు సరైన సమయం ఇదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వ్యక్తులు నివసించే సమూహాలు, వాతావరణం, చివరకు భాష కూడా వినికిడి శక్తిలో వ్యత్యాసాలకు కారణమని తేల్చారు. ఈ మార్పుల చోటుచేసుకున్న తీరును మాత్రం వివరించలేదు. ఇక నగరాల్లో ఉన్న వారు ఎక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను బాగా వినగలిగితే గ్రామాల్లోని వారు మాత్రం తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను కూడా బాగా వినగలుగుతున్నట్టు గుర్తించారు. ట్రాఫిక్ రొదలో నిత్యం గడపడం కారణంగా నగరాల్లోని జనాల్లో లో ఫ్రీక్వెన్సీ కలిగిన రొద నుంచి తప్పించుకునేందుకు ఈ తరహా మార్పు చోటుచేసుకున్నట్టు వివరించారు.
Also Read: నవజాత శిశువుల గురించి మీకీ ఆసక్తికర విషయాలు తెలుసా