Health Tips: ఈ పదార్థాల్లో ఉప్పు కలిస్తే విషంతో సమానం.. పొరపాటున కూడా తినకండి..
ABN , Publish Date - Apr 03 , 2025 | 06:39 PM
Salt toxicity in foods: ఎక్కువ ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు కలిపిన వెంటనే శరీరానికి ప్రమాదకరంగా మారే అనేక ఆహారపదార్థాలు ఉన్నాయి. 90 శాతం మంది ఇది తెలియక ఈ ఆహార పదార్థాలపై ఎప్పుడూ ఉప్పు చల్లుకుని తింటుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.

Risks of too much salt: ఉప్పు శరీరానికి అత్యవసరమైన లవణం. ఇది వేయకపోతే ఆహారపదార్థాల రుచిగా ఉండవు. అలాగని ఎక్కువ కలుపున్నా నోట్లో పెట్టుకోలేం. కానీ, కొందరికి ప్రతి పదార్థంలో ఉప్పు వేసే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని ఆహారాల్లో ఉప్పు కలిపి తింటే శరీరాన్ని విషపూరితం చేస్తాయి. ఇదేగాక, భారతదేశంలో ప్రజలు అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు, చక్కెరను ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ పదార్థాల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఉప్పు చల్లుకునే తింటారు. ఇది ఎంత హానికరమో తెలియదు. అందుకే, ఉప్పుతో ఎప్పుడూ తినకూడని ఆ పదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వస్తువులకు ఉప్పు కలిపిన వెంటనే విషంగా మారుతాయి:
పెరుగు
తరచుగా ప్రజలు పెరుగులో ఉప్పు వేసి తింటుంటారు. కానీ పెరుగులో ఉప్పు వేసుకుని తినడం ఎందుకు హానికరమో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదంలో పాలు, పాల ఉత్పత్తులకు ఉప్పు వేయకూడదని అంటారు. ఇదే కాక పెరుగులో ఉప్పు కలిపి తినే వారిలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోయే ప్రమాదమూ ఉంది. ముఖం మీద బొబ్బలు, చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు.
పండ్లు
మీకు పండ్లల్లో ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉంటే ఈరోజు నుంచే మానేయండి. పండ్లపై ఉప్పు కలిపి తినడం చాలా హానికరం. దీని కారణంగా పండ్లలో లభించే పోషకాలు తగ్గుతాయి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల గుండె, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు పెరగవచ్చు.
సలాడ్
చాలా మంది పండ్లపై వేసినట్లుగానే సలాడ్‌పై ఉప్పు చల్లుకుని తింటారు. అయితే ఇలా చేయకూడదు. దీని కారణంగా శరీరంలో సోడియం పరిమాణం ఎక్కువవుతుంది. ముఖ్యంగా రైతా పైన ఉప్పు కలిపి తినకూడదు. అధిక ఉప్పు మూత్రపిండాల వ్యాధులతో సహా అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
జ్యూస్
జ్యూస్ రుచిగా ఉంటుందని చాలామంది ఉప్పు కలుపుకుని తాగుతారు. ఈ పద్ధతి మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు. దీనివల్ల పండ్లలోని పోషకాలు కూడా తగ్గుతాయి. మామూలుగానే ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడుతుంటారు. ఇక అదనంగా పండ్ల రసాలలో కూడా ఉప్పు వాడితే నష్టపోతారు. ఈ వాడకాన్ని పూర్తిగా నివారించాలి.
Read Also: Skin Care: తమలపాకుతో గ్లోయింగ్ స్కిన్.. ఈ 3 చర్మ సమస్యలు కూడా పోతాయ్..
Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..
Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..