Green Dal: పెసర్ల గురించి మతి పోగొట్టే విషయాలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:04 PM
ఐఏఎస్ ఇంటర్వ్యూలో మాంసం తినే పప్పు దినుసులపై అభ్యర్థికి ఓ ప్రశ్న ఎదురైంది. మరి, నిజంగా పెసర్లు మనిషి మాంసం తింటాయా?.. ఇందులో నిజం ఎంత..

పప్పు దినుసుల్లో అత్యంత శక్తివంతమైన పప్పు దినుసులు ఏవి అంటే.. మన ఆలోచనల్లోకి కచ్చితంగా పెసర్లు వస్తాయి. పెసర్లలో ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసర్లు మనిషి మాంసం తింటాయని మీకు తెలుసా?.. ఇదే విషయంపై ఐఏఎస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా వచ్చిందట. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థిని.. ‘ మనిషి మాంసం తినే పప్పు దినుసు నిజంగా ఉందా?’ అని అడిగారు. దానికి ఆ అభ్యర్థి ఏం సమాధానం చెప్పాడో తెలీదు కానీ.. మనిషి మాంసం తినే పప్పు దినుసు మాత్రం .. పెసర్లే.. మీకు ఇక్కడ ఓ అనుమానం రావచ్చు.. మన మాంసం తినే పెసర్లు.. మనకు ఎలా మంచి చేస్తాయి అని..
అదే ఇక్కడ ట్విస్ట్.. పెసర్లలో .. ముఖ్యంగా పచ్చ పెసర్లలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనే ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి జీర్ణ క్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఎంజెమ్స్ చనిపోయిన జీవులను తిని బతికే వాటిలాగా పని చేస్తాయి. ఇవి మన శరీరంలోని చెడు పదార్థాలను తీసేయటంతో పాటు చెడు మాంసాన్ని తినేస్తాయి. అంటే మన శరీరంలోని టాక్సిన్స్‌ను, వ్యర్థ పదార్ధాలను, అనవసరపు కొవ్వులను శుభ్రం చేస్తాయి. దీని వల్ల మన బరువు, రక్తపోటు కంట్రోల్‌లో ఉండటంతో పాటు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శాకాహారులకు పెసర్లు దేవుడు ఇచ్చిన వరంలాంటివి. ఇందులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
4 వేల ఏళ్ల చరిత్ర
పెసర్లు పండించడంలో భారతదేశానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 4 వేల ఏళ్లనుంచి భారతదేశంలో పెసర్లు పండిస్తున్నారు. పెస్లర్ల పుట్టుక కూడా మన ఇండియాలోని కర్ణాటకలో జరిగింది. పురాతన గ్రంధాల్లోనూ దీని ప్రస్తావన ఉంది. తర్వాతి కాలంలో పెసర్ల పంట ఇండియానుంచి సౌత్ఈస్ట్ ఏషియాతో పాటు చైనాకు కూడా పాకింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో పెసర్లను ఎక్కువగా పండిస్తున్నారు. ఎడారి ప్రాంతం కావటంతో అక్కడ పెసర్ల పంట బాగా పండుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నల్ల, పచ్చ పెసర్లు పెద్ద ఎత్తున పండిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
TTD Board Decisions: తిరుమలలో ఈ రూల్స్ పాటించాల్సిందే.. టీటీడీ సంచలన నిర్ణయం
Amazon: గుడ్ న్యూస్..ఈ ఛార్జీలను తొలగించిన అమెజాన్..
Kunal Kamra Controversy: హాబిటాట్ క్లబ్ ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి దిగిన బీఎంసీ