Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:52 PM
Watermelon For Diabetes: భగభగ మండే ఎండల్లో గొంతు తడారిపోకుండా చేసే ఆహారపదార్థాల్లో పుచ్చకాయ ప్రధానమైంది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండే పుచ్చకాయని షుగర్ ఉన్నవారు తినవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఇదే..

Watermelon For Diabetes: వేసవి కాలం మండే ఎండలతో పాటు మామిడి, పుచ్చకాయ, కర్భూజ లాంటి రుచికరమైన పండ్లనూ వెంటబెట్టుకొస్తుంది. వీటిలో దాహం తీరేందుకు ఎక్కువ మంది తినేది పుచ్చకాయనే. ఎర్రగా, తియ్యటి రుచితో నోరూరించే ఈ పండును ఇష్టపడనివారు తక్కువే. డీహైడ్రేషన్ సమస్య రాకుండా నివారించేందుకు మధ్యాహ్నం అయ్యేసరికి కాసిన్ని పుచ్చకాయ ముక్కలను ప్రతిరోజూ తింటూ ఉంటారు. మరి, నీరు, తీపి కలగవలసిన పుచ్చకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా? తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ ఉన్నవారు ఎంత GI ఉన్న ఆహారాలు తినాలి..
పుచ్చకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఈ కాయలో పుష్కలంగా లభిస్తాయి. కానీ, డయాబెటిక్ రోగులు ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ముందు దాని గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఏదైనా తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ ఎంత మేరకు పెరుగుతాయని చెప్పే కొలతే GI. దీనిని 0 నుండి 100 వరకు కొలుస్తారు.
ఆహారంలో GI ఎంత తక్కువగా ఉంటే డయాబెటిక్ రోగికి ఆ పదార్థం అంత సురక్షితం.
పోషకాహార నిపుణుల ప్రకారం, 55 లేదా అంతకంటే తక్కువ GI ఉన్న ఆహారాలే డయాబెటిక్ రోగులకు శ్రేయస్కరమైనవి.
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 56-69 మధ్య ఉంటే మధ్యస్థంగా పరిగణిస్తారు.
70 లేదా అంతకంటే ఎక్కువ GI ఉంటే అస్సలు తినకూడదు.
షుగర్ ఉంటే పుచ్చకాయ తినాలా?వద్దా?
పుచ్చకాయలో ఉండే GI 72. అంటే ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ వర్గానికి చెందినది. అధిక GI ఉండటమే కాకుండా, తక్కువ GL అంటే గ్లైసెమిక్ లోడ్ (కేవలం 2 మాత్రమే) ఉంటుంది. గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్న పదార్థాలు డయాబెటిక్ రోగులు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో షుగర్ ఉన్నవాళ్లు పుచ్చకాయను ఒక కప్పు (150 గ్రా) పరిమాణంలో తిన్నా ఏం కాదు.
ఈ విషయాల్లో జాగ్రత్త..
డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు పుచ్చకాయ తినకూడదు. భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా పుచ్చకాయను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
పుచ్చకాయ తినడానికి ముందు, తరువాత ప్రతిసారీ మీ రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకోండి.
మరో ముఖ్యమైన విషయం. పుచ్చకాయ తిన్న తర్వాత కచ్చితంగా ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ (గింజలు, పెరుగు వంటివి)తీసుకోండి. అప్పుడు రక్తంలో చక్కెర నెమ్మదిగా శోషణ చెందుతుంది.
పుచ్చకాయ రసం చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది కాబట్టి జాగ్రత్త.
Read Also : Diabetes Tips: షుగర్ పేషెంట్లు చెరకు రసం తాగొచ్చా.. తాగకూడదా..
Diabetes Effects: షుగర్ వస్తే ఎముకలు, కీళ్ళు ఎందుకు దెబ్బతింటాయి.. నివారణ చిట్కాలు..
Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..