Share News

Donald Trump: అమెరికాలో 5.32లక్షల మంది తాత్కాలిక వలస వీసాల రద్దు

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:31 AM

వీరి తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిలో క్యూబా, హైతీ, నికరాగ్వాన్‌, వెనిజులా దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. వీరందరికీ చట్టపరమైన భద్రతను తొలగిస్తున్నట్టు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ పేర్కొంది.

Donald Trump: అమెరికాలో 5.32లక్షల మంది తాత్కాలిక వలస వీసాల రద్దు

నెలరోజుల్లో దేశం నుంచి బహిష్కరణ

వాషింగ్టన్‌, మార్చి 22: అమెరికా వలస విధానాన్ని సమూలంగా మార్చేసిన అధ్యక్షుడు ట్రంప్‌.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక వలస వీసాపై అమెరికాలో ఉన్న 5,32,000 మందిపై కొరడా ఝళిపించారు. వీరి తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిలో క్యూబా, హైతీ, నికరాగ్వాన్‌, వెనిజులా దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. వీరందరికీ చట్టపరమైన భద్రతను తొలగిస్తున్నట్టు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ పేర్కొంది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్టు తెలిపింది. మరోవైపు, మాజీ అధ్యక్షుడు బైడెన్‌, మాజీ ఉపాధ్యక్షురాలు కమల, మాజీ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సహా పలువురికి సెక్యూరిటీ క్లియరెన్స్‌ను ట్రంప్‌ రద్దు చేశారు. ఆయా నేతలకు ప్రభుత్వం అందిస్తున్న ఎస్కార్ట్‌, ఇతర సదుపాయాలను కూడా రద్దు చేయాలని పలు విభాగాలను ఆదేశించారు. దీంతో ఆయా నేతలకు రోజువారీ బ్రీఫింగ్‌ ఇకపై ఉండదు. అలాగే, గత ప్రభుత్వంలో నియమితులైన ఇంటెలిజెన్స్‌ అధికారులు సైతం ఎవరికీ సమాచారాన్ని చేరవేయరాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రంప్‌.. ‘‘దేశ ప్రయోజనాల రీత్యా వారికి ఇకపై ఇలాంటి సమాచారం ఇవ్వడం సరికాదు’’ అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 03:31 AM