తినేసి వెళ్లిపోవాలంతే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:16 PM
ఈ మధ్య రాజకీయాలతో పాటు, రియల్ ఎస్టేట్ చర్చలన్నీ హోటల్, కేఫ్‌లలోనే నడుస్తున్నాయి. కస్టమర్లని తీసుకుపోయి చల్లగా ఏసీ కింద కూర్చోబెట్టి, టీ తాగించి ఫలానా వెంచర్ గురించిన చర్చలు, బేరసారాలు అక్కడే సాగిస్తున్నారు.

హోటల్లోనో, కేఫ్‌లోనో కలిస్తే చాలు... గంటల తరబడి అక్కడే తిష్ట వేసేవారు చాలామందే ఉంటారు. ఇక అన్ని ముచ్చట్లు అక్కడే. శుబ్బరంగా తినేసి వెళ్లకుండా, మరొకరు ఆ టేబుల్ కోసం ఎదురు చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా హస్క్ కొడుతుంటారు.
ఈ మధ్య రాజకీయాలతో పాటు, రియల్ ఎస్టేట్ చర్చలన్నీ హోటల్, కేఫ్‌లలోనే నడుస్తున్నాయి. కస్టమర్లని తీసుకుపోయి చల్లగా ఏసీ కింద కూర్చోబెట్టి, టీ తాగించి ఫలానా వెంచర్ గురించిన చర్చలు, బేరసారాలు అక్కడే సాగిస్తున్నారు. బల్లలన్నీ ఇలాంటివారితోనే నిండిపోతున్నాయని ఉడుక్కున్న బెంగళూరుకు చెందిన ‘పాకశాల రెస్ట్టారెంట్’ స్ట్రయిట్‌గా ఒక కండీషన్ పెట్టింది.
‘ఈ సౌకర్యం భోజనం చేయడానికి మాత్రమే. రియల్ ఎస్టేట్, రాజకీయాల గురించి చర్చించడానికి కాదు. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి’ అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా ఏకంగా ఒక బోర్డు తగిలించింది. అంటే... ‘వచ్చామా.. తిన్నామా.. బిల్లు కట్టి వెళ్లిపోయామా’ అన్నట్లే ఉండాలి అంటూ కస్టమర్లకు సుతిమెత్తగా చెప్పింది. దీన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కొందరు రెస్టారెంట్ చేసిన పనిని సమర్ధించగా... మరికొందరు మాత్రం ‘ఇదేం నిబంధన?’ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ‘తింటున్నప్పుడు రాజకీయ చర్చలు కాకుండా పోకేమాన్, డోరేమాన్ గురించి మాట్లాడుకోవాలా?, ఫ్యామిలీ పాలిటిక్స్ ఓకేనా’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

రైలు రద్దు .. రిజర్వేషన్ టికెట్ రిఫండ్ పొందండం ఎలాగంటే..

ఈ ఫొటోలో 78 ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా..?

ప్రాణాలు తీస్తున్న ప్రేమికులు.. కాళ్లపారాని ఆరకముందే ..

బైకు హ్యాండిల్‌కు వేలాడుతున్న బ్యాగు.. దగ్గరికి వెళ్లి చూడగా..
