Pharma Industry: మేకిన్ అమెరికా అంటోన్న మన ఫార్మా కంపెనీలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:25 PM
భారత ఫార్మా కంపెనీలు ఇండియాతో పాటు అమెరికాలోనూ మందులు ఉత్పత్తి చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా అక్కడి యూనిట్ల కొనుగోలుపైనా మన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ కొత్తగా విధిస్తోన్న టారిఫ్ లు, కొత్త బెదిరింపులు, ఇతరత్రా ఇబ్బందులు తప్పించుకునేందుకు 'మేకిన్ అమెరికా' (Make in America) మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.

అమెరికా బాస్ డొనాల్డ్ ట్రంప్ 'రెసిప్రోకల్ టారిఫ్స్'(మీరెంత ట్యాక్స్ వేస్తే మేమూ అంతే వేస్తాం) నినాదం పుణ్యమాని భారత ఫార్మా దిగ్గజ కంపెనీలు (pharma industry) కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. మధ్యేమార్గంగా అమెరికాలోనే సొంత ప్లాంట్స్ పెట్టే 'మేకిన్ అమెరికా' పనుల్ని షురూ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ మనదేశంలోనే ఉత్పత్తి చేసిన మందుల్ని అమెరికాకు ఎగుమతి చేస్తూ వచ్చాయి దేశీయ ఫార్మా కంపెనీలు. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్స్ వంటి ఉత్పత్తులు వీటిలో ముఖ్యమైనవి.
అయితే, ఇక మీదట ఇండియాతో పాటు అమెరికాలోనూ మందులు ఉత్పత్తి చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా అక్కడి యూనిట్ల కొనుగోలుపైనా మన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ కొత్తగా విధిస్తోన్న టారిఫ్ లు, కొత్త బెదిరింపులు, ఇతరత్రా ఇబ్బందులు తప్పించుకునేందుకు 'మేకిన్ అమెరికా' (Make in America) మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇది భవిష్యత్ లో లాభదాయకమనే ఉద్దేశ్యంతో ఉన్నాయి. అమెరికాలో యూనిట్ల కొనుగోలు, నిర్వహణ విషయంలో ఆదిలో ఇబ్బందులు వచ్చినా గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాయి.
అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్రాన్యూల్స్ వంటి మన దిగ్గజ ఫార్మా కంపెనీలకు అమెరికాలో ఇప్పటికే యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు నాట్కో ఫార్మా వంటి కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సన్ ఫార్మా 355 మిలియన్ డాలర్లు వెచ్చించి నాస్‌డాక్‌లో నమోదైన చెక్‌పాయింట్ థెరప్యూటిక్స్ అనే సంస్థను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల క్యాన్సర్ మందుల విభాగంలో విస్తరించే అవకాశం సన్ ఫార్మాకు లభిస్తుంది. సింజెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికాలో తొలి బయోలాజిక్స్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఎమెర్జెంట్ బయోసొల్యూషన్స్, అహ్మదాబాద్‌కు చెందిన సెనోరెస్ ఫార్మా వంటి మరిన్ని కంపెనీలు కూడా యూఎస్ లో కొత్తగా ప్లాంట్స్ పెట్టబోతున్నాయి.
అయితే, ఫార్మా కంపెనీల తాజా నిర్ణయం మనదేశంలో ఔషధ పరిశ్రమకు కేంద్ర స్థానంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి. మరోవైపు, అమెరికా(america) ఉత్పత్తులపై ఏ దేశం ఎంత దిగుమతి సుంకం విధిస్తే, అంతే మొత్తాన్ని ఆయా దేశాల అదే తరహా ఉత్పత్తులపై విధిస్తామని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(trump) ఇండియాకు సంబంధించి, ఏప్రిల్ 2న టారిఫ్స్ విషయం ఫైనల్ చేస్తానని ప్రకటించారు. ఇదెలా ఉంటుందోనని భారత పారిశ్రామిక వర్గాలు ఆశక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్
ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్.. కొత్త నిబంధనలు?
Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here