Tiger Woods: ట్రంప్ మాజీ కోడలితో టైగర్ ఉడ్స్ ప్రేమాయణం
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:45 PM
దాదాపు 120 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న వివాదంలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకున్న గోల్ఫ్ స్టార్ టైగర్ ఉడ్స్ మెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వెనీసా ట్రంప్‌తో ప్రేమలో పడ్డాడు.

వివాదాస్పద గోల్ఫ్ స్టార్ టైగర్ ఉడ్స్ ప్రేమలో పడ్డారు. అది కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వెనీసా ట్రంప్‌తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రపంచానికి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘ నువ్వు నా పక్కన ఉంటే నా జీవితం చాలా బాగుంటుంది’ అని పేర్కొన్నారు. టైగర్ ఉడ్స్ మాత్రమే కాదు.. వెనీసా కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఉడ్స్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. వీరిద్దరికీ గతంలో రెండ్రెండు సార్లు పెళ్లిళ్లు అయ్యాయి. తమ భాగస్వాములతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గత కొంత కాలం నుంచి వీరి ప్రేమాయణం గురించి లోకల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి నిజమని తేలింది.
వివాదాలకు కేరాఫ్ ఉడ్స్
ఉడ్స్ గోల్ప్ ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2003లో ప్రముఖ స్వీడిస్ మోడల్ ఎలిన్ నార్డెగ్రెన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, 2009లో ఉడ్స్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పెళ్లయి భార్య ఉన్నా కూడా అతడు పలువురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తేలింది. కొంతమంది మహిళలు, యువతులు తాము ఉడ్స్‌తో సంబంధం పెట్టుకున్నామని మీడియాకు చెప్పారు. దాదాపు 120 మందితో అతడు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడనే విషయం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే ఒప్పుకున్నాడు. దీంతో అతడి కెరీర్ నాశనం అయింది. అతడితో బ్రాండ్ ప్రమోషన్ డీల్స్ కుదుర్చుకున్న సంస్థలు.. ఆ డీల్‌ను రద్దు చేసుకున్నాయి. 2010లో ఎలిన్, ఉడ్స్ విడిపోయారు. ఆ తర్వాత 2013లో లిండ్సే వాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ 2015లో విడిపోయారు.
గ్యాంగ్‌స్టర్ టు ప్రెసిడెంట్ కొడుకు
వెనీసా టీనేజ్‌లో ఉన్నపుడు ఓ వీధి రౌడీని ప్రేమించింది. తర్వాత 1998లో లియోనార్డో డికాప్రియోతో ఆమెకు సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక, అదే సంవత్సరం ఆమె ఖాలిద్ బిన్ బందర్ అల్ సద్ అనే సౌదీ యువరాజును పెళ్లి చేసుకుంది. 2001 వరకు ఇద్దరూ కలిసి ఉన్నారు. కొన్నేళ్ళ తర్వాత వెనీసా.. డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రేమలో పడింది. జూనియర్ ట్రంప్ లక్షన్నర డాలర్లు విలువ చేసే రింగుతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. 2005 సంవత్సరంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, అనుకోని కారణాల వల్ల ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. 2018లో 15 ఏళ్ల వివాహబంధానికి శుభం పలుకుతూ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
Supreme Court Collegium: జస్టిస్ యశ్వంత్‌వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు.. సుప్రీం కొలిజియం సిఫారసు
Nuclear Boy FBI: 12 ఏళ్లకే ఇంట్లో న్యూ క్లియర్ రియాక్టర్ కట్టాడు.. తర్వాత FBI ఏజెంట్లు వచ్చి..