Viral Video: ఎగిరే విమానంలో లేడీ రచ్చ.. చివరికి తగులబెట్టే ప్రయత్నం
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:46 PM
అత్యంత కీలకమైన విమాన భద్రతా నియమాలను ధిక్కరిస్తూ, విమానంలో మహిళ చేసిన నిర్వాకం సిబ్బందిని విస్తుపోయేలా చేసింది. ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.

వైరల్ న్యూస్(viral video): ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్లే విమానంలో ప్రయాణిస్తోన్న ఒక మహిళ, ఫ్లైట్ లోని వాళ్లందర్నీ బెంబేలెత్తించింది. తోటి ప్రయాణీకుల్ని.. విమాన సిబ్బందిని ఆగమాగం చేసింది. విమానంలో ఏకంగా సిగరెట్ వెలిగించిన ఆమె, ధూమపానం చేసింది. పొగ బయటకు వదలడంతో పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది ఒక్కసారిగా ఆమె దగ్గరకు చేరుకుని సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే, సిగరెట్ ఇవ్వకపోవడమే కాదు, మరో చేతితో లైటర్ వెలిగించి ఏకంగా విమానాన్నే అంటించే ప్రయత్నం చేసింది.
సీట్ కవర్స్ తగులబెట్టేందుకు ప్రయత్నించగా ఎయిర్ హోస్టెస్ అతికష్టం మీద నిలువరించారు. అయినా తగ్గని ఆమె, అక్కడున్న నాప్కిన్ అంటించేకు తెగించింది. అయితే, ఎట్టకేలకు వాటర్ బాటిల్ లోని నీళ్లు పోసి మహిళా సిబ్బంది సదరు మహిళ చర్యల్ని అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యంత కీలకమైన విమాన భద్రతా నియమాలను ధిక్కరిస్తూ, విమానంలో ఆ మహిళ చేసిన నిర్వాకాన్ని నెటిజనం ఎండగడుతున్నారు. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకుండా సదరు మహిళా ప్రయాణీకురాలి నిర్లక్ష్యపు ప్రవర్తనను చాలా మంది ఖండిస్తున్నారు. ఒక్కరి చిన్న ఉల్లంఘన సైతం విమానంలో ఉన్న అందరి ప్రాణాలకీ ముప్పును తెచ్చిపెడతాయని మండిపడుతున్నారు. ఇదే ఆ వీడియో..