Share News

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:56 AM

బీజేపీ బలోపేతా నికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ అన్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న రామకృష్ణ

ఎమ్మిగనూరు టౌన, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతా నికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక శ్రీ సుశీలమ్మ దేవాలయ కల్యాణ మండపంలో అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్‌ తోగట నరసింహులు అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, పార్టీ బలోపేతం దిశగా సభ్యత్వాలను ముమ్మరం చేయాలన్నారు. బీజేపీ మోదీ నాయకత్వంలో సాధించిన విజయాలను, ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు చంద్రమౌళి, జిల్లా ఇనచార్జి అంకాల్‌ రెడ్డి, జట్టెప్ప, శివ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:56 AM