గాలి దుమారం..వడగండ్ల వాన
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:54 AM
జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులుతో కూడి న వడగళ్ల వాన కురిసింది.

బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం/చాట్రాయి/కామ వరపుకోట/చింతలపూడి/లింగపాలెం/ముసునూరు ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులుతో కూడి న వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వేడిగాలు లతో జనం అల్లాడిపోగా ఒకసారిగా వాతావరణంలో మా ర్పులు వచ్చి వర్షం కురిసింది. బుట్టాయ గూడెంలో మండలం కామవరం, పాత మోతు గూడెం, మోతుగూడెం కాలనీ, దొరమామిడి పైన అటవీ ప్రాంతాల్లోని కొండరెడ్డి గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర అలంకరణలు ఈదురు గాలులకు ఎగిరి పోయాయి. ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా వడగండ్లు పడ్డాయని కొండరెడ్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో వడగండ్ల వాన పడింది. చాట్రాయి, ముసునూరు మండలాల్లో ఈదురు గాలులతో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. వర్షానికి కల్లాలపై ఉన్న మొక్కజొన్న కండెలు తడిచిపోయాయని, మామిడి కాయలు నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు, గోపవరం, చిల్లబోయినపల్లి, గోగులంపాడు తదితర గ్రామాల్లో విద్యుత్ స్థంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామవరపు కోట, చింతలపూడి, లింగపాలెం ప్రాంతాల్లో ప్రధాన రహ దారులపై చెట్ల కొమ్మలు పడడంతో రాకపోకలు స్తంభిం చాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకాల వర్షంతో జీడిమామిడి, మామిడి, మిర్చి, పొగాకు, మొక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.