Share News

United States : అమెరికాలో శతాధిక వృద్ధులు 2 కోట్ల మంది అట!

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:48 AM

అగ్రరాజ్యం అమెరికాలో శతాధిక వృద్ధులు 2 కోట్ల మంది ఉన్నారట! వారిలో 200 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య 2 వేల మార్కు దాటేసిందట! ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే 369 ఏళ్ల వయసు వ్యక్తి ఒకరున్నారట!

United States : అమెరికాలో శతాధిక వృద్ధులు  2 కోట్ల మంది అట!

200 ఏళ్లు దాటిన 2 వేల మంది

369 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడట!

విస్మయం కలిగిస్తున్న అమెరికా సామాజిక భద్రత డేటాబేస్‌ గణాంకాలు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 18: అగ్రరాజ్యం అమెరికాలో శతాధిక వృద్ధులు 2 కోట్ల మంది ఉన్నారట! వారిలో 200 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య 2 వేల మార్కు దాటేసిందట! ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే 369 ఏళ్ల వయసు వ్యక్తి ఒకరున్నారట! అమెరికా సామాజిక భద్రత విభాగం (ఎస్‌ఎ్‌సఏ) డేటాబే్‌సలోని ఈ గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. ‘డోజ్‌’ సారథి ఎలాన్‌ మస్క్‌ ‘ఎక్స్‌’లో ఈ వివరాలను వెల్లడిస్తూ ‘ఇది చరిత్రలోనే అతిపెద్ద మోసమ’ని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చును కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏర్పాటు చేసిన ‘డోజ్‌’ విభాగం... ఈ డేటాబేస్‌ తీగ లాగితే డొంక కదిలింది. సామాజిక భద్రత నంబర్లు ఉన్న వారి సంఖ్య ప్రస్తుతం అమెరికా జనాభాను దాటిపోయిందంటూ మస్క్‌ విస్మయం వ్యక్తం చేశారు. 2023 జూలైలో నిర్వహించిన ఆడిట్‌లో ఎస్‌ఎ్‌సఏ డేటాబే్‌సలో కోటీ 89 లక్షల మంది వందేళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు. కానీ జనాభా లెక్కల ప్రకారం దేశంలో 86 వేల మంది మాత్రమే వందేళ్లు దాటిన వారు ఉన్నట్లు తేలింది. 1886, 1893లో పుట్టినవాళ్లు కూడా ఇంకా జీవించి ఉన్నట్లు డేటాబేస్‌ చూపిస్తోంది. వీరందరికీ సోషల్‌ సెక్యూరిటీ నంబర్లు ఉన్నాయి. మరణాలకు సంబంధించిన సమాచారం ఎస్‌ఎ్‌సఏ రాకపోవడం, వచ్చినా నమోదు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. దాంతో ఎప్పుడో గతించినా... డేటాబేస్‌ మాత్రం బతికే ఉన్నట్లు చూపిస్తోంది.

Updated Date - Feb 19 , 2025 | 04:48 AM