Share News

అదృష్టం అంటే ఈమెదే.. వెయ్యి పెట్టి కొంటే 8 కోట్లు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 09:50 PM

పెయింటింగ్‌ను తీసుకుని ఇంటికి వచ్చాక, దాన్ని పరిశీలించి చూశారు. వెనకాల ఓ స్టాంప్ కనిపించింది. దాన్ని ఎవరో ఫ్రాంచ్ నుంచి అమెరికాకు ఇంపోర్టు చేసినట్లు ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లారు.

అదృష్టం అంటే ఈమెదే.. వెయ్యి పెట్టి కొంటే 8 కోట్లు..
1000 Painting Turns Rs 8 Crore

ప్రతీ గింజపై తినే వాడి పేరు రాసి పెట్టి ఉంటుందని అంటారు. ఒక వేళ ఆ గింజలపై మన పేరు రాసి పెట్టి ఉండకపోతే.. మన నోటి వరకు రావు. ఇది సత్యం. మరి అదృష్టం పడిశం పట్టినట్లు పడితే మాత్రం.. మని తినే అన్నంలో కూడా వజ్రాలు దొరకొచ్చు. ఊహలకందని విధంగా సర్‌ప్రైజ్ చేయటమే అదృష్టం స్పెషాలిటీ. ఈ సుత్తంతా ఎందుకు చెబుతున్నానంటే .. ఓ మహిళ కొన్ని నెలల క్రితం వెయ్యి రూపాయలు పెట్టి ఓ పాత పెయింటింగ్ కొనింది. ఆమె అదృష్టం కొద్ది ఆ పెయింటింగ్ 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోబోతోంది. అమెరికాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన హైడీ మార్కోవ్‌కు పురాతన వస్తువులు అమ్మే షాపు ఉంది.


సంవత్సరం క్రితం ఆమె తన భర్తతో కలిసి పాత వస్తువుల వేలంపాటకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ పాత పెయింటింగ్ బాగా నచ్చింది. దాన్ని వేలం పాటలో 12 డాలర్లకు కొంది. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 1,026 రూపాయలు అవుతుంది. పెయింటింగ్‌ను తీసుకుని ఇంటికి వచ్చాక, దాన్ని పరిశీలించి చూశారు. వెనకాల ఓ స్టాంప్ కనిపించింది. దాన్ని ఎవరో ఫ్రాంచ్ నుంచి అమెరికాకు ఇంపోర్టు చేసినట్లు ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. అతడు ఆ పెయింటింగ్‌ను పరిశీలించి.. భార్యాభర్తలిద్దరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ‘ ఆ బొమ్మ 18వ శతాబ్ధానికి చెందినది. దాన్ని ప్రముఖ ఫ్రెంచ్ పెయింటర్ పీర్రే అగస్టే రేనాయిర్ గీశాడు.


అది మొత్తం చార్‌కోల్‌తో గీసిన పెయింటింగ్. దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది’ అని అన్నాడు. తర్వాత దాన్ని న్యూయార్క్‌లోని ఓ నాన్ ప్రాఫిట్ సంస్థకు పంపాడు. ఆ సంస్థలోని వాళ్లు పురాతన వస్తువులను భద్రపరుస్తూ ఉంటారు. ఆ పెయింటింగ్ అత్యంత పురాతనమైనదని, ఒరిజినల్ కాపీ అని తేల్చారు. హైడీ ఆ పెయింటింగ్‌ను ఎనిమిదిన్నర కోట్లకు అమ్మాలని చూస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి:

Gold Rate: నిజంగా పండగలాంటి వార్తే.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర

UP: నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Updated Date - Mar 30 , 2025 | 09:50 PM