Share News

‘ఫిక్సిటింగ్‌ ’ ప్రమాదమే!

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:47 AM

వేణు, భాగ్య దంపతులు. వారి కుటుంబంలో కూడా చిన్న చిన్న దెబ్బలాటలు ఉంటాయి. కానీ అవి మొబైల్స్‌లో టెక్స్ట్‌ మెసేజ్‌లుగా మారి... మరింత ముదిరిపోయాయి...

‘ఫిక్సిటింగ్‌ ’  ప్రమాదమే!

వేణు, భాగ్య దంపతులు. వారి కుటుంబంలో కూడా చిన్న చిన్న దెబ్బలాటలు ఉంటాయి. కానీ అవి మొబైల్స్‌లో టెక్స్ట్‌ మెసేజ్‌లుగా మారి... మరింత ముదిరిపోయాయి. వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది.

ఈ ఆధునిక యుగంలో మొబైల్స్‌ సర్వసాధారణమయిపోయిన తర్వాత ఒకరితో మరొకరు సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం సులభమయిపోయింది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నా- కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందే- టెక్స్ట్‌ మెసేజ్‌ల ద్వారా దెబ్బలాడుకోవటం. దీనికే మానసిక నిపుణులు ‘ఫిక్స్‌టింగ్‌’ అని పేరు పెట్టారు. దీనివల్ల కొన్ని లాభాలున్నా.. ఎక్కువగా నష్టాలే ఉన్నాయంటున్నారు మానసిక నిపుణుడు డాక్టర్‌ ప్రసాదరావు. ఆ నష్టాలేమిటో చూద్దాం...

  • ఎదురెదురుగా ఉండి దెబ్బలాడుకున్నప్పుడు- వాడే భాష, హాహభావాలు, శరీర కదలికలు మొదలైనవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కానీ టెక్స్ట్‌ మెసేజ్‌లలో కేవలం పదాలు మాత్రమే ఉంటాయి. దానిని ఎవరు ఏ విధంగానైనా అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాలలో సరైన భాషను వాడకపోవటం వల్ల అనేక అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. దీనితో గొడవలు మరింతగా పెరిగిపోతాయి.

  • ఎదురెదురుగా ఉండి దెబ్బలాడుకున్నప్పుడు- ఆవేశం తగ్గిన తర్వాత రాజీ పడటానికి అవకాశం ఉంటుంది. మన మెదడు అవతల వ్యక్తులతో మనం గడిపిన మంచి గుర్తులను వెలికి తెస్తుంది. దానితో వారి పట్ల మనకు సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. టెక్స్ట్‌ మెసేజ్‌లలో అలాంటి అవకాశమే ఉంటుంది. ఒక సారి మెసేజ్‌ చదివిన తర్వాత దానిని మళ్లీ వెనక్కి తీసుకోగలిగే అవకాశమే ఉండదు.

  • ‘ఫిక్సిటింగ్‌’లో గొడవలు త్వర త్వరగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు అవతల వ్యక్తులతో మనకున్న బంధాన్ని తెంచేసుకొనే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మిలినియల్స్‌, జెన్‌ జెడ్‌ (18 నుంచి 35 సంవత్సరాల లోపువారు)లు ఎక్కువ సార్లు ‘ఫిక్సిటింగ్‌’లోకి దిగుతారు.


నివారణ మార్గాలివే...

  • టెక్స్ట్‌ పంపేముందు మనం చెప్పదలుచుకున్న భావం కరెక్టేనా అనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు చూసు కోవాలి. భాషను కూడా చెక్‌ చేసుకున్న తర్వాత మాత్రమే మెసేజ్‌ను పంపాలి.

  • మెసేజ్‌లు పంపే సమయంలో ‘‘నేను’’ అనే పదాన్ని ఎక్కువసార్లు వాడకండి. ‘‘నాకు ఇలా అర్థమయింది’’ అని వాడితే సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.

  • మాటల దెబ్బలాటకు రంగం సిద్ధం అవుతోందనుకుంటే... ఛాటింగ్‌ నుంచి బయటకు వచ్చేయండి. తాత్కాలికంగా మెసేజ్‌లు పంపటం మానేయండి.

  • మెసేజ్‌ల ద్వారా మాటల యుద్ధం ముదురుతోందనుకున్నప్పుడు... నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి. లేకపోతే నేరుగా కలవండి.

ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:47 AM