Virginia: అమెరికాలో కాల్పులు..ఇద్దరు భారతీయుల మృతి
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:29 AM
వర్జీనియాలోని ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో పని చేస్తున్న ప్రదీప్ కుమార్ పటేల్ (56), ఆయన కుమార్తె (24)పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

న్యూయార్క్, మార్చి 23: అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వర్జీనియాలోని ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో పని చేస్తున్న ప్రదీప్ కుమార్ పటేల్ (56), ఆయన కుమార్తె (24)పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకోమాక్ కౌంటీలో లాంక్ ఫోర్డ్ హైవేలోని దుకాణంలో గురువారం ఉదయం తండ్రీ కుమార్తె పని చేస్తున్న సందర్భంగా దుండగుడు వీరిపై కాల్పులకు తెగబడినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్ ఆయన భార్య, కుమార్తె ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.