Share News

Donald Trump: మన కంటే ఇండియా చాలా బెటర్ : డోనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:12 PM

జో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటి నుండి అమెరికాలో అమల్లో ఉన్న ఓటింగ్ పద్ధతులను పదే పదే ప్రశ్నిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

Donald Trump: మన కంటే ఇండియా చాలా బెటర్ : డోనాల్డ్ ట్రంప్
Donald Trump

Donald Trump : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ జో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటి నుండి అమెరికాలో అమల్లో ఉన్న ఓటింగ్ పద్ధతులను పదే పదే ప్రశ్నిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పుడు తిరిగి అధికారంలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియ సమూల ప్రక్షాలనకు పూనుకుంటున్నారు.ఎన్నికలు "నిజాయితీగా, ప్రజల విశ్వాసానికి అర్హమైనవిగా ఉండాలని చెబుతున్న ట్రంప్. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు తీసుకొస్తున్నారు. భారత్‌ ఎన్నికల ప్రక్రియను కీర్తించిన ట్రంప్.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో కఠిన నియమాలు తీసుకొస్తూ రూపొందించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు.


స్వయం పాలన పరంగా ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తున్న అమెరికా.. ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక, అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఇండియా (India), బ్రెజిల్‌ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్‌ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయని, కానీ, అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోందని అన్నారు. మన ఎన్నికల ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయని ట్రంప్‌ సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ట్రంప్ తెచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇక మీదట ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని ఓటరు గుర్తింపుగా చూపించాలి. యూఎస్‌ పాస్‌పోర్ట్‌ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వాళ్లు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పోలీసుల నిద్ర.. వీడియో వైరల్

ఇక నా వల్ల కాదమ్మా.. చనిపోతున్నా

Updated Date - Mar 26 , 2025 | 01:12 PM