Myanmar Earthquake: మయన్మార్‌లో అద్భుతం..భూకంపం జరిగిన 5 రోజులకు..శిథిలాల నుంచి సజీవంగా..
ABN , Publish Date - Apr 03 , 2025 | 06:11 PM
Myanmar Earthquake: ఐదు రోజుల క్రితం మయన్మార్‌ను తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భయంకర ప్రకృతి విపత్తు ధాటికి వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. తాజాగా ఏ ఉపాధ్యాయుడిని రెస్క్యూ అధికారులు శిథిలాల నుంచి సురక్షితంగా బయటికి తీశారు. అతడ 5 రోజుల నుంచి..

Myanmar Earthquake: గత శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌ను 7.7 తీవ్రతతో భయంకర భూకంపం కుదిపేసింది. బుధవారం నాటికి మృతుల సంఖ్య 2,886కు చేరుకోగా, 4,639 మంది గాయపడ్డారు. వందలాది మంది ఇంకా ఆచూకీ తెలియలేదు. భూకంపంలో కూలిపోయిన వేలాది భవనాలు, వంతెనలు, రోడ్ల కింద ఎంత మంది చిక్కుకున్నారో ఇప్పటికీ స్పష్టత రావడంలేదు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఉపాధ్యాయుడిని సహాయక సిబ్బంది రక్షించారు. 5 రోజులుగా హోటల్ శిథిలాల కిందే చిక్కుకున్నా ప్రాణాలతో బయటపడిన ఓ టీచర్ ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
5 రోజుల పాటు ఇవి తాగే బతికాడు..
భూకంపం అనంతరం పెద్ద పెద్ద గుట్టల్లా పేరుకుపోయిన శిథిలాల నుంచి బాధితులను రక్షించడం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. అయినప్పటికీ, స్థానిక రెస్క్యూ కార్మికుల బృందం ఎండోస్కోపిక్ కెమెరాను ఉపయోగించి బాధితులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా బుధవారం హోటల్ శిథిలాల కింద 5 రోజులుగా నలిగిపోతున్న ఓ టీచర్‌ను కాపాడారు. స్వాల్ టా నాన్ గెస్ట్ హౌస్ లో బస చేసిన 47 ఏళ్ల ఉపాధ్యాయుడు టిన్ మాంగ్ హ్ట్వే భూకంపం సంభవించినప్పటి నుంచి రెస్క్యూ సిబ్బంది కనుగొనేవరకూ హోటల్ శిథిలాల కిందే కూరుకుపోయాడు. ఇన్ని రోజులు నిద్రాహారాలు, తాగేందుకు నీరు లేకుండా ప్రాణాలతోనే ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
7.7 తీవ్రతతో భూకంపం సంభవించగానే హోటల్ రూంలో ఉన్న మంచం కింద దాక్కున్నాడు టిన్. చూస్తుండగానే హోటల్ మొత్తం కూలిపోయి బయటికి వెళ్లే దారులు మూసుకుపోయాయి. రక్షించండి. రక్షించండి అని అరుస్తున్నా టిన్ మాటలు ఎవరికీ వినిపించలేదు. నరకంలో ఉన్నట్టు శరీరం మండుతున్నా దాహం తీర్చుకునే దారి లేక మూత్రాన్ని తాగి ప్రాణాలు నిలుపుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది ఎట్టకేలకు తనను గుర్తించగానే టిన్ ఆనందానికి అవధుల్లేవు. చనిపోకుండా బయటపడటంతో సంతోషంతో ఏడ్చాడు. కోలుకున్న తర్వాత తిరిగి టీచర్ ఉద్యోగానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.
Read Also: Trump Tariffs: ట్రంప్ దెబ్బ.. భారీగా పెరగనున్న వీటి ధరలు
India vs Pakistan Army: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. ఎవరిది గెలుపు.. బలాబలాలు, బలహీనతలు ఇవే..
Earth Poles Video: భూభాగం అంతరించిపోతుందా.. మస్క్ వీడియో నిజమేనా