Zelenskyy: జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. పుతిన్ త్వరలోనే చనిపోతాడు
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:06 PM
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య సంధి కుదుర్చేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ తర్వలోనే చనిపోతాడని.. అప్పుడే ఇరు దేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని చెప్పుకొచ్చాడు. పారిస్‌లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జెలన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం గురించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే జెలన్‌స్కీ తాజా వ్యాఖ్యలు చేశాడు.
జెలన్‌స్కీ బుధవారం నాడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశం అయ్యాడు. అనంతరం జెలన్‌స్కీ మీడియాతో మాట్లాడుతూ.. "తను(పుతిన్) త్వరలోనే చనిపోతాడు. అది వాస్తవం. అప్పుడే ఇరు దేశాల మధ్య యుద్ధం ముగుస్తుంది" అని చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. పుతిన్ అనారోగ్యానికి గురైనట్టు నివేదికలు వెలువడుతోన్న వేళ.. జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతవారం ఓ సమావేశంలో పాల్గొన్న పుతిన్.. స్వల్ప గుండెపోటుకు గురయ్యారని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిల్లో పుతిన్ కాళ్లు, చేతులు వణికిపోతున్నట్టు కనిపించింది. ఈ నేపథ్యంలోనే జెలన్‌స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
తాము శాంతి కోసం ప్రయత్నాలు చేస్తుంటే రష్యా మాత్రం యుద్ధం కొనసాగించాలని భావిస్తుందని.. అందుకే దీన్ని ముందుకు తీసుకెళ్తుందని జెలన్‌స్కీ ఆరోపించాడు. నిజంగా యుద్ధం ముగియాలంటే.. రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని కోరాడు.
ప్రస్తుతం ఇరు దేశా మధ్య.. 30 రోజుల పాటు ఇంధన లక్ష్యాలపై కాల్పులు జరపకూడదనే ఆంక్షలు ఉన్నాయి. అలానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి.. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరింపచేశాడు. అయినప్పటికి కూడా రష్యా 117 డ్రోన్ దాడులకు పాల్పడిందని.. జెలన్‌స్కీ ఆరోపించాడు.
ఇదిలా ఉండగా.. యుక్రెయిన్.. క్రిమియాలోని గ్యాస్ నిల్వ కేంద్రం, కుర్క్స్, బ్రయాన్స్క్ ప్రాంతాలలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
కామెడీ చేయటం మానుకోండి.. యోగిపై స్టాలిన్ ఫైర్..
ఓలా, ఉబర్‌లకు షాక్.. కేంద్రం కొత్త యాప్.. ఇక డ్రైవర్లకు పండగే