Share News

Relaxation tips: ఎంత ఒత్తిడిలో ఉన్నా ఈ టిప్స్‌‌తో ఈజీగా రిలాక్స్ అయిపోవచ్చు

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:07 AM

మీ మనసు బాగోలేనప్పుడు, మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు గ్రహిస్తే వెంటనే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి. ఏ ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఉండటం ద్వారా మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఏవైనా గొడవలు జరిగేటప్పుడు మనం ఒత్తిడిలో ఉన్నామని తెలిస్తే వెంటనే సైలెంట్ అయిపోయి.. అక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమమైన పని

Relaxation tips: ఎంత ఒత్తిడిలో ఉన్నా  ఈ టిప్స్‌‌తో ఈజీగా రిలాక్స్ అయిపోవచ్చు
Relaxation tips

నేటి ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తి ఒత్తిడికి లోనవ్వడం సర్వసాధారణంగా మారింది. పనిలో, ఇంట్లో, ఆరోగ్య పరమైన సమస్యలతో ఒత్తిడి, ఆర్థిక పరిస్థితుల కారణంగా, ఇలా ఎన్నో రకాలైన ఒత్తిడులను వ్యక్తులు భరించాల్సి వస్తుంది. కొంతమంది ఫ్రెజర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.


ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో గతవారం ఇద్దరు వ్యక్తులు కుటుంబంలో తగదాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఒత్తిడిని తట్టుకోలేపోవడం. ప్రతి వ్యక్తికి ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. తన సామర్థ్యానికి మించి ఫ్రెజర్‌కు లోనైతే ఎలా అధిగమించాలో తెలియక ఆత్మహత్యనే పరిష్కారంగా చాలామంది ఎంచుకుంటున్నారు. కాని ఆత్మహత్యతో సమస్య పరిష్కారం కాదనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈక్రమంలో ఎలాంటి ఒత్తిడినైనా జయించే కొన్ని టిప్స్ తెలుసుకుందాం.


నిమిషం పాటు..

మీ మనసు బాగోలేనప్పుడు, మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు గ్రహిస్తే వెంటనే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి. ఏ ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఉండటం ద్వారా మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఏవైనా గొడవలు జరిగేటప్పుడు మనం ఒత్తిడిలో ఉన్నామని తెలిస్తే వెంటనే సైలెంట్ అయిపోయి.. అక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమమైన పని. అదే ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైతే కొద్దిసేపు మనం చేస్తున్న పనిని ఆపివేసి.. మనకు ఇష్టమైన అలవాట్లవైపు దృష్టి పెట్టాలి. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువుగా ఉందనే ఫీలింగ్ మనసులో వస్తే వెంటనే పని మొత్తాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు రిక్రేషన్ క్లబ్ లేదా.. కార్యాలయం ఆవరణ బయటకు వచ్చి రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయాలి. టీ తాగే అలవాటు ఉంటే వెంటనే టీ తాగడం మంచిది. క్యారమ్స్ ఆడే అలవాటు ఉంటే కొద్దిసేపు క్యారమ్స్ ఆడటం వలన మీరు ఒత్తిడిని మరిచిపోయి కొత్త ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా మీ పని పూర్తిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం పని ప్రదేశంలో లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులతో కొద్దిసేపు మాట్లాడండి. ఇలాంటి చిన్న పనులతో ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించవచ్చు.


ఆ పనులు చేయకండి

ఒత్తిడిని అధిగమించడానికి మిమల్ని మీరు నియంత్రించుకోవం చాలా ముఖ్యం. మీరు ఒత్తిడిలో ఉన్న సమయంలో గొడవలు పడటం, గట్టిగా అరవడం వంటి పనులు చేయకూడదు. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడపటం ద్వారా మాత్రమే ఎలాంటి ఒత్తిడినైనా జయించి ప్రశాంతమైన జీవనాన్ని గడపగలమనే విషయాన్ని తెలుసుకోవాలి.


నోట్: ఈ వార్తలోని అంశాలు కేవలం నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇచ్చినవి మాత్రమే. ప్రతి వ్యక్తికి ఇవే అంశాలు వర్తిస్తాయని నిర్దిష్టంగా చెప్పలేము. ఎవరైనా తమ సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను లేదా సైకాలజిస్టులను సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి...

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్డ్.. కాసేపట్లో విడుదల..

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 21 , 2025 | 11:07 AM