-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 15th April 2025 Tuesday Live Updates on Top Stories Latest Headlines Politics, Sports, Business and Real-Time Updates in Telugu Siva
-

Breaking News: రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్..
ABN , First Publish Date - Apr 15 , 2025 | 10:51 AM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-15T14:01:33+05:30
రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్..
హైదరాబాద్: సీఎం రేవంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉంది
కానీ సొంత పార్టీ నేతలు కనీసం విష్ చేయలేదు.
సొంత పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలిపే సమయం కూడా లేదా.
గుర్తు పెట్టుకొని తనకు బర్త్ డే విశేష్ చెప్పిన సీఎంకు ధన్యవాదాలు చెప్పిన రాజ సింగ్
-
2025-04-15T13:27:19+05:30
త్వరలోనే టీబీజేపీ అధ్యక్ష ఎన్నిక
నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి చర్చ జరగలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
భూములు అమ్మి పాలన చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.
ఇంట్లో ఉన్న చెట్టు కొట్టాలన్నా.. GHMC అనుమతి తీసుకోవాలి.
అలాంటి HCUలో చెట్లను ఎలా కొట్టారు.
'ఎక్స్' ఖాతా నుంచి నేను ఎలాంటి పోస్ట్ డిలీట్ చేయలేదు.
డిలీట్ చేసి ఉంటే కేసు పెట్టుకోండి.
సౌత్‌కు వ్యతిరేకంగా చర్యలెందుకు తీసుకుంటాం.
మాకూ సౌత్‌లో బలపడాలని ఉంటుంది కదా.
AIDMKతో గతంలోనే పొత్తుండేది.. ఇప్పుడు పునరుద్ధరించాం.
అన్నామలైకి జాతీయ స్థాయిలో అవకాశం ఇస్తారు.
-
2025-04-15T12:45:42+05:30
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ
గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సునీత పిటిషన్
సునీత పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ
వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్రపై ప్రశ్నించిన సీజేఐ.
వివేకా హత్య తర్వాత గాయాలు కనబడకుండా కట్లు కట్టి.. గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీత తరఫు న్యాయవాదులు.
ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ.
అవినాష్‌రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించిన.. పిటిషన్లతో ఈ పిటిషన్ జత చేయాలని సూచించిన సుప్రీంకోర్టు.
తదుపరి విచారణ వాయిదా.
-
2025-04-15T11:40:00+05:30
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి కౌంటర్
అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే కేసీఆర్ ఆత్మ
కేసీఆర్ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు
ధరణి పోర్టల్‌తో భూములను అక్రమంగా దోచుకుని.. వారి అనుయాయులకు కట్టబెట్టారు.
అక్రమంగా దోచుకున్న భూములను మా ప్రభుత్వం.. వెనక్కి తీసుకుంటుందని భయపడుతున్నారు.
అప్పట్లో అక్రమ సంపాదనతో లాభపడ్డ వారే.. మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు.
ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని చూస్తున్నారు.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.
తప్పు చేసిన వారికి సంకెళ్లు వేసి తీరుతాం.
బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదు.
ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి.
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి ఆ కుర్చీలో కూర్చోవాలని.. తండ్రీకొడుకులు పగటి కలలు కంటున్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరు.
-
2025-04-15T11:10:40+05:30
ఢిల్లీ: ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు
రూ.7.5 కోట్ల విలువైన భూ వ్యవహారంలో వాద్రాకు నోటీసులు.
ఈనెల 8న ఈడీ విచారణకు గైర్హాజరైన రాబర్ట్ వాద్రా.
ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా.
గుర్గావ్ ల్యాండ్ స్కామ్, భూసేకరణ లావాదేవీల కేసులో ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా.
-
2025-04-15T11:00:59+05:30
BRS ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసుగుచెందారు.
ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్లడర్లు, పారిశ్రామికవేత్తలు అంటున్నారు.
అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.
ఆ ఖర్చు తామే భరిస్తామంటున్నారు.
-
2025-04-15T11:00:16+05:30
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ అణ్వాయుధాలను మర్చిపోవాల్సిందే.
లేకుంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య తప్పదు.
అణు ఒప్పందంపై ఇరాన్ కావాలనే తాత్సారం.
మమ్మల్ని ఇరాన్ మోసం చేస్తోందనిపిస్తోంది.
-
2025-04-15T10:51:43+05:30
సైఫ్ అలీఖాన్ కేసులో సంచలనం..
ముంబై: సైఫ్ అలీఖాన్ కేసులో ట్విస్ట్
సైఫ్ ఇంట్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కాని..
నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ ఫింగర్ ప్రింట్స్