Share News

Breaking News: కూటమి నేతల అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ

ABN , First Publish Date - Apr 16 , 2025 | 09:48 AM

Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: కూటమి నేతల  అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ
Breaking News

Live News & Update

  • 2025-04-16T17:41:54+05:30

    కూటమి నేతల అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ

    • విశాఖపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్- 2 కట్టమూరి సతీష్ పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ

    • డిప్యూటీ మేయర్‌గా కట్టమూరి సతీష్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు ఇంకా పూర్తి కానందున అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరించిన జిల్లా కలెక్టర్

    • మునిసిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్లు పదవీ కాలం పూర్తి కానందునే అవిశ్వాస తీర్మానం నోటీస్ తిరస్కరణ

    • ఈ ఏడాది జూలై 30 కి కట్టమూరి సతీష్ నాలుగేళ్ల పదవి కాలం పూర్తి

    • మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మరో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ అంగీకారం

    • ఈ నెల 19న మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపైన, ఈ నెల 26న డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై అవిశ్వాస తీర్మానం పై జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం

  • 2025-04-16T16:08:29+05:30

    వక్ఫ్ చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

    • వక్ప్ సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ

    • వక్ప్ సవరణ చట్టం చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

    • కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సిజెఐ ధర్మాసనం

  • 2025-04-16T12:49:50+05:30

    ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

    • కర్నూలు: ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

    • అవిశ్వాస తీర్మానానికి హాజరుకాని చైర్‌పర్సన్ శాంత

    • ప్రత్యేక బస్సుల్లో మున్సిపల్ ఆఫీస్‌కు 35 మంది వైసీపీ కౌన్సిలర్లు

    • గుర్తింపు కార్డులున్న కౌన్సిలర్లను లోపలకు అనుమతి

  • 2025-04-16T12:15:44+05:30

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

    • ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగులను తొలగించారు

    • సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరినీ ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది.

    • సుమారు 500 మంది ఉద్యోగుల తొలగింపు

    • ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.

    • వైసిపి నేతలు చెప్పిన వారినందరిని గతంలో ఫైబర్ నెట్‌లో చేర్చుకున్న అప్పటి యాజమాన్యం.

    • పులివెందుల, కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారిని ఉద్యోగులుగా చేర్చిన అంశంపై అప్పటిలోనే వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.

    • ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న ఉద్యోగులు.

  • 2025-04-16T12:11:34+05:30

    హెచ్‌సీయూ భూములపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..

    • హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

    • కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరుగగా.. తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    • సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విధానం ఇదీ..

    • చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలన్న జస్టిస్ బీఆర్ గవాయ్

    • 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్న జస్టిస్ గవాయ్

    • అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు చెప్పిన ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి.

    • తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని వివరించిన అమికస్ క్యూరీ.

    • అనుమతులు తీసుకున్నారా లేదా.. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న జస్టిస్ గవాయ్.

    • మీరు చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుండి కాపాడాలనుకుంటే, ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలన్న ధర్మాసనం.

    • 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకొమని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.

    • మూడు రోజుల సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏమిటి.

    • ఆ సెలవుల్లోనే బుల్డోజర్లు తీసుకొచ్చారు.

    • పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాము.

    • రూ. 10 వేల కోట్లకు మార్టిగేజ్ చేసారని సీఈసీ నివేదికలో చెప్పిందన్న అమికస్ క్యూరీ.

    • భూములను మార్టిగేజ్ చేసారా లేదా, అమ్ముకున్నారో లేదో మాకు మాకు అనవసరం.

    • చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం అన్న జస్టిస్ గవాయ్.

    • 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి, తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి, ఐటి పార్కు, ఇతర ప్రాజెక్టులు వివరాలు చెప్పిన అభిషేక్ మను సింఘ్వి.

    • వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైనే తాము దృష్టి సారించాలని అంటున్నామన్న జస్టిస్ గవాయ్

    • వంద ఎకరాల్లో జంతువులకు తీవ్ర నష్టం జరుగుతుందన్న మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి.

    • సీఎస్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్న నిరంజన్.

    • వంద ఎకరాలు మార్టిగేజ్ చేసి, చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటి పార్క్ అని చెపుతున్నారన్న నిరంజన్ రెడ్డి.

    • పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తామన్న జస్టిస్ గవాయ్.

    • ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలన్న జస్టిస్ గవాయ్.

    • సీఈసీ నివేదికలో మార్టిగేజ్ వ్యవహారం స్పష్టంగా ఉందన్న అమికస్ క్యూరీ.

    • రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా.. ఈ భూములను వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పజెప్పాలని కోరిన అమికస్ క్యూరీ

    • మే 15వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.

    • మార్టిగేజ్ వ్యవహారం తమకు సంబంధం లేదన్న జస్టిస్ గవాయ్.

    • పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా... 1996 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యమని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.

    • దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారో అణా విషయం మాకు ప్రధానం అన్న జస్టిస్ గవాయ్.

    • మిగిలిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన జస్టిస్ గవాయ్.

    • సీఈసీ నివేదికపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చిన ధర్మాసనం

    • ఆర్టికల్ 142 కింద పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తామన్న జస్టిస్ బిఆర్ గవాయ్.

    • పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం.

    • నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.

    • కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్‌కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు.

    • తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.

    • పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీ అధికారులను తాత్కాలికంగా జైలుకు పంపిస్తాం. ఈ మధ్యకాలంలో అక్కడ ఒక్క చెట్టైనా కొట్టరాదు. బుల్డోజర్లు తొలగించబడ్డాయా అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు.

    • 100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి, అమలులోకి తీసుకురావాలని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణాధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • 2025-04-16T12:00:21+05:30

    తిరుమలలో భారీ స్కామ్..

    • తిరుమల: గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

    • కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారు.

    • స్వామి వారికీ మొక్కులు చెల్లింపులో భాగంగా భక్తులు వివిధ రూపంలో తులాభారం సమర్పిస్తారు.

    • తులా భారం ద్వారా నిత్యం 10 లక్షల రూపాయలను భక్తులు కానుకలను సమర్పిస్తున్నారు.

    • గత 5ఏళ్ల వైసీపీ పాలనలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారు.

    • తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి చేతులు దులుపుకున్నారు.

    • తులా భారంలో అక్రమాలపై విజిలేన్స్ విచారణకి డిమాండ్ చేస్తున్నా.

    • శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ ఎగరడం నిఘా వైఫల్యంగా భావిస్తున్నా.

    • భద్రతా సిబ్బంది కొరత వుంది.. సిబ్బందిని కూడా పెంచుతాం.

    • త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తాం.

  • 2025-04-16T11:35:34+05:30

    గుంటూరు: అశ్లీల వెబ్‌సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

    • లూయిస్ కాల్ సెంటర్ పేరుతో అశ్లీల వీడియోల చిత్రీకరణ

    • మహిళ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • వీడియోలతో పాటు లైవ్ షోస్‌ను వెబ్‌సైట్లకు ఇస్తున్నారు: ఈగల్

    • క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు

    • గుంతకల్‌కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ..

    • ఉద్యోగులతో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు

    • లూయిస్‌తో పాటు శ్రీకాకుళంకు చెందిన గణేష్‌, జ్యోత్సను అరెస్ట్ చేశాం

  • 2025-04-16T11:34:09+05:30

    అమరావతి: సీఎం చంద్రబాబుతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు భేటీ

    • హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్‌, నారాయణ

    • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘం సభ్యులకు వివరణ

    • కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సాయంపై చర్చ

  • 2025-04-16T11:28:14+05:30

    దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు.

    • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం.

    • టీపీసీసీ చీఫ్ అందుబాటులో లేని కారణంగా తెలంగాణలో రేపు నిరసనలు చేపట్టాలని నిర్ణయం.

    • టీపీసీసీ చీఫ్ లేకపోయినా.. అధిష్టానం పిలుపుతో ధర్నా చేస్తానంటున్న సీనియర్ నేత వీహెచ్.

    • ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి వీహెచ్ నిరసన.

  • 2025-04-16T10:15:02+05:30

    హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

    • సురానా, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీల్లో తనిఖీలు.

    • బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో సోదాలు.

    • సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు.

    • సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ ఎండీ ఇంట్లో సోదాలు.

    • 3 బ్యాంకులకు రూ.3,986 కోట్లు ఎగ్గొట్టిన సురానా గ్రూప్.

    • రుణాలు చెల్లించపోవడంపై 3 కేసులు నమోదు చేసిన సీబీఐ.

    • సురానాకు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య డెవలపర్స్.

    • 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ.11.62కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్.

    • సురానా గ్రూప్, అనుబంధ సంస్థలపై PMLA కేసు నమోదు.

    • కంపెనీ ఎండీ దినేష్‌చంద్ సురానా, విజయ్‌రాజ్ సురానా, ఇద్దరు డమ్మీ డైరెక్టర్లను 2022లో అరెస్ట్ చేసిన ఈడీ.

  • 2025-04-16T10:10:42+05:30

    చైనా సుంకాల విషయంలో చర్చలపై వైట్‌హౌస్ కీలక ప్రకటన

    • బంతి చైనా కోర్టులోనే ఉంది

    • చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు.

    • చర్చలకు రావాల్సింది చైనానే.. మాకు ఆ అవసరం లేదు.

    • చైనాకు, ఇతర దేశాలకు మధ్య తేడా లేదు.

    • కాకపోతే చైనాపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి.

    • మా మార్కెట్ పైనే చైనా ఎక్కువగా ఆధారపడుతుంది.

  • 2025-04-16T09:48:29+05:30

    తెలంగాణలో అకాల వర్షం బీభత్సం..

    • ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం

    • రాత్రి కురిసిన అకాల వర్షానికి నర్సంపేట డివిజన్‌లో..

    • మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం

    • దుగ్గొండిలో నేలకూలిన విద్యుత్ స్తంబాలు, చెట్లు

    • నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన మొక్కజొన్నలు

    • మహబూబాబాద్ జిల్లాలోనూ గాలివాన బీభత్సం

    • మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో భారీగా పంట నష్టం