-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 09 04 2025 Wednesday Live Updates on Top Stories Latest Headlines Politics, Sports, Business and Real-Time Updates in Telugu Siva
-

Breaking News: మా భవిష్యత్తు ప్లాన్ ఇదే.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - Apr 09 , 2025 | 08:49 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-09T16:38:33+05:30
సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ
సీడబ్ల్యూసీ సమావేశాల్లో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
గాంధేయవాదులంతా ఏకం కావాలి
దళితులు, ఆదివాసీలు, పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది
బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పోరాటం
కులగణనతోనే దేశంలో ఓబీసీలు, దళితులు, మైనార్టీల సంఖ్య తేలుతుంది
తెలంగాణలో విజయవంతంగా కులగణన నిర్వహించాం
కులగణన విషయంలో దేశానికే తెలంగాణ మార్గం చూపింది
జాతీయ స్థాయిలో కులగణన చేపట్టే వరకు పోరాడతాం
బీసీ రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రానికి రేవంత్‌రెడ్డి బిల్లు పంపారు
రేవంత్‌రెడ్డి పంపిన బిల్లుపై కేంద్రం చర్యలు తీసుకోవట్లేదు
కులగణన ద్వారా రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాం
కులగణనకు RSS, బీజేపీ వ్యతిరేకం
తెలంగాణలో 90 శాతం ప్రజలు ఓబీసీలు, దళితులు, మైనార్టీలు
తెలంగాణ సంపద మాత్రం ఈ వర్గాల దగ్గర లేదు
10 శాతం కార్పొరేట్ వర్గాల దగ్గర తెలంగాణ సంపద ఉంది
-
2025-04-09T13:49:58+05:30
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు.
ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీతో కీలక నిర్ణయం.
అమెరికాలో స్థిరపడేందుకు.. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రభాకర్‌రావు.
గతంలోనే పాస్ పోర్ట్‌ను జప్తు చేస్తున్నట్లు.. ప్రకటించడంతో లభించిన గ్రీన్ కార్డ్
అమెరికా కాన్సులేట్, కేంద్రం సహకారంతో.. ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం.
-
2025-04-09T13:43:59+05:30
విజయవాడ: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు.
ఈనెల 23 వరకు రిమాండ్ పొడిగించిన సీఐడీ కోర్టు.
వల్లభనేని వంశీ సహా 12 మందికి రిమాండ్ పొడిగింపు.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితుడిగా వంశీ.
-
2025-04-09T13:43:11+05:30
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని నేతలపై ఖర్గే ఆగ్రహం.
పనిచేయని నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలి.
బాధ్యతలు విస్మరించే వారు పార్టీ నుంచి తప్పుకోవాలి.
కష్టపడి పనిచేసే వారికే టికెట్లు.
-
2025-04-09T13:39:50+05:30
అమరావతి: సిట్ విచారణకు మూడోసారి రాజ్ కసిరెడ్డి డుమ్మా
లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న కసిరెడ్డి
విచారణకు రావాలని 4 రోజుల క్రితం సిట్ నోటీసులు
ఇప్పటివరకు ఎదురుచూసిన సిట్ అధికారులు
కసిరెడ్డి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నయాని పోలీసులకు సమాచారం
నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలోనూ..
రాజ్ కసిరెడ్డి హైదరాబాద్‌లో లేరని గుర్తించిన అధికారులు
ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా విచారణకు రాని కసిరెడ్డి
తనకు సంబంధం లేని విషయంలో నోటీసులు ఇస్తున్నారని..
విజయవాడ సీపీకి మెయిల్ పంపిన రాజ్ కసిరెడ్డి
-
2025-04-09T12:26:08+05:30
గచ్చిబౌలి పీఎస్‌లో BRS నేతల విచారణ
హైదరాబాద్: గచ్చిబౌలి పీఎస్‌లో BRS నేతల విచారణ
కొనసాగుతున్న క్రిశాంక్, దిలీప్ కొణతం విచారణ
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో AIతో సృష్టించిన..
ఫేక్ ఫొటోలు, వీడియోలు ప్రచారం చేశారని ఆరోపణలతో కేసు
క్రిశాంక్, దిలీప్ స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్న పోలీసులు
-
2025-04-09T12:09:24+05:30
ఢిల్లీ: కొలిక్కి వస్తున్న విభజన చట్టంలోని అంశాలు.
విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై దృష్టి సారించిన కేంద్రం.
పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు, ఉపరితరల రవాణా సత్వర చర్యలు ప్రారంభించాలన్న కేంద్ర హోం శాఖ.
తొందరల్లోనే అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ ఉత్తర భాగం అనుమతులు, ప్రారంభం కానున్న ప్రక్రియ.
ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఆమోదం.
మరో రిఫైనరీ ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు హోం శాఖ ఆదేశం.
రెండు ఏళ్ళలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్న రైల్వే బోర్డు.
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ కర్నూల్ కారిడార్ ఏర్పాటును పరిశీలించనున్న కేంద్ర రైల్వే శాఖ.
వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్‌కు సంబంధించి ఏపీకి పెండిగ్ వున్న మరో 350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించిన కేంద్ర ఆర్థిక వ్యయ శాఖ.
దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందిందని, కొద్ది రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు అందుతుందని దాని ఆధారంగా ముందకు వెళతామని వెల్లడించిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ అధికారులు.
ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలపై పరిష్కారానికి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు.
ప్రభుత్వ ఉన్నతాధికారుల తో గత నెల 3వ తేదీన జరిగిన కేంద్ర హోం శాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు.
చట్టంలోని లేని ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అంశాలపైనా పురోగతి.
ఫిబ్రవరి 3 వ తేదీన కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేత్రత్వంలో జరిగిన సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు.
ఏపీ ఎస్ఎఫ్‌సి విభజన, విభజన చట్టంలోని షెడ్యూల్ 9 లోని కార్పోరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులు అప్పులు పంచుకోవడం, రోడ్లు, రైలు, విద్యా సహా అనేకానేకాక అంశాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు.
రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న అంశాలపై ప్రజంటేషన్ ఇచ్చిన ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.
రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష.
ఇకపై ప్రతి రెండు నెలల కొకసారి సమావేశం కావాలని నిర్ణయం.
షెడ్యూల్ 9 లోని సుమారు 53 కార్పొరేషన్లు, కంపెనీల ఆస్తుల విభజనపై ఉత్తర్వులు విడుదల చేయాలన్న కేంద్రం.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ విభజనపై హైకోర్టులో వున్న స్టే ఎత్తివేశాక తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
షెడ్యూలో 9, 10 లోని సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల విభజన పంపకంపై కోర్టు చిక్కులు వున్నందున తదుపరి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని ముందకు వెళ్ళాలని నిర్ణయం.
చట్టంలో లేని 12 సంస్థలకు సంబంధించి ఉత్తర్వులు ఏపీ కోరగా అందుకు అంగీకరించిన కేంద్ర హోం శాఖ.
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధులకు సంబంధించి త్వరితగతిన పరిష్కారానికి కాగ్ కు లేఖ రాయనున్న కేంద్ర హోం శాఖ.
ఉమ్మడి సంస్థల నిర్వహణపై తెలంగాణా పెట్టిన ఖర్చు తిరిగి చెల్లింపునకు సంబంధించి వీలైనంత త్వరగా తేల్చాలని కూడా కాగ్‌ను కోరాలని నిర్ణయం.
ఏపీలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే రూ. 135 కోట్లు విడుదల చేసిన కేంద్రం.
గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఆమోదం లభించిందని, రానున్న రోజుల్లో మరింత ముందకు వెళతామని వెల్లడించిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు.
మరో రిఫైనరీ ఏర్పాటు చేయాలని ఏపీ చేస్తున్న ప్రతిపాదనను పరిశీలించాలని సంబంధిత శాఖకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు.
విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, రెండు విమానాశ్రయాల విస్తరణ పనులు వీలైనంత త్వరగా పూర్తవుతాయని వెల్లడించిన ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్.
అప్పటివరకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని రైల్వే బోర్డుకు కేంద్ర హోం శాఖ సూచన.
అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేపై వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని, సూత్రప్రాయ అంగీకారం తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
-
2025-04-09T10:20:49+05:30
మంచు మనోజ్ ఇంటిదగ్గర ఉద్రిక్తత..
మనోజ్‌ని ఇంట్లోకీ రానీయకుండా అడ్డగింపు
దీంతో గేట్ ముందు కూర్చొని నిరసన తెలుపుతున్న మంచు మనోజ్
-
2025-04-09T10:09:00+05:30
ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి మహిళా ఆత్మహత్యాయత్నం
పిల్లర్ నెంబర్ 4 ,5 మధ్య నుండి దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్న మహిళ
పోలీస్ చెక్ పోస్ట్ నుంచి వెంటనే స్పందించి మహిళను కాపాడే యత్నం చేస్తున్న పోలీసులు
పోలీసులు తాడు అందిస్తున్న పట్టుకోకుండా వదిలేస్తున్న మహిళ
ప్రకాశం ప్రకాశం బ్యారేజ్‌పై భారీగా స్తంభించిన ట్రాఫిక్
-
2025-04-09T08:49:02+05:30
చైనాకు బిగ్ షాక్..
చైనాపై భారీ సుంకం విధించిన డొనాల్డ్ ట్రంప్.
104 శాతం అదనపు సుంకాలు విధింపు.
చైనా ప్రతీకార సుంకాలు తొలగించనందుకు భారీ టారిఫ్.
నేటి నుంచి అమల్లోకి రానున్న అదనపు టారిఫ్.