-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 14th April 2025 Monday Live Updates on Top Stories Latest Headlines Politics, Sports, Business and Real-Time Updates in Telugu Siva
-
Breaking News: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. రాజ్ కసిరెడ్డి ఇంటికి నోటీసులు
ABN , First Publish Date - Apr 14 , 2025 | 12:47 PM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-14T18:15:38+05:30
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
ఏపీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఏపీ సిట్ సోదాలు
గచ్చిబౌలిలోని ఒక ఆసుపత్రిలో కొనసాగుతున్న ఏపీ సిట్ సోదాలు
రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్ లో గాలింపు
రాయదుర్గం పోలీసుల సహాయంతో ఆసుపత్రిలో ఏపీ సిట్ బృందాలు సోదాలు
రాజ్ కసిరెడ్డి కి చెందిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో డైరెక్టర్లు
సిట్ విచారణకు హాజరుకాకుండా హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు సిట్ అనుమానం
ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు గుర్తింపు
జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో ఏపీ సిట్ బృందాల గాలింపు
రాజ్ కసిరెడ్డి దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఎల్ఓసి ఇచ్చిన ఏపీ పోలీసులు
సిట్ విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తప్పించుకొని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి
జూబ్లీహిల్స్‌లో రాజ్ కసి రెడ్డి నివాసానికి నోటీసులు అంటించునున్న ఏపీ సిట్ బృందం
-
2025-04-14T17:25:03+05:30
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్
ఈనెల 16న సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని అఫిడవిట్ లో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం
ఈ భూముల్లోనే యూనివర్శిటీ, మరికొన్ని సంస్థలు, బస్టాండ్‌లు వచ్చాయని సుప్రీంకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయవివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు పెరిగి అడవిలాగా తయారైందన్న తెలంగాణ ప్రభుత్వం
గత రెండు రోజులనుంచి ఢిల్లీలో మకాం వేసి, సీనియర్ న్యాయవాదులతో చర్చించి అపిడవిట్ ను సిద్దం చేసిన సిఎస్ శాంతి కుమారి
-
2025-04-14T13:55:02+05:30
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం
విదేశీ విద్యా దీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం.
అప్పుడు ఈ పథకం ద్వారా 7 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
వైసీపీ హయాంలో కేవలం 437 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.
-
2025-04-14T13:28:27+05:30
కూటమి రాకతో ప్రజలకు స్వేచ్ఛ
కూటమి ప్రభుత్వ రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భయానక పరిస్థితులు
ఈ పది నెలల్లో మెరుగైన పాలన అందించాం
-
2025-04-14T13:28:26+05:30
అమరావతిని ఎడారి అన్నారు
వైసీపీ నేతలు అమరావతిని ఎడారి అన్నారు
వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారు.
-
2025-04-14T13:13:02+05:30
మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి
మీ ఊరిని మర్చిపోవద్దు.. మీ కుటుంబాలతో పాటు ఊరిని కూడా అభివృద్ధి చేయాలని కోరిన సీఎం చంద్రబాబు
-
2025-04-14T13:07:43+05:30
చంద్రబాబు గ్రేట్ లీడర్- విద్యార్థులు
ఆయన వల్లే తాము విదేశాల్లో చదువుకుంటున్నామని తెలిపిన విద్యార్థులు
విద్యార్థినితో మాట్లాడిన చంద్రబాబు
-
2025-04-14T13:04:22+05:30
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులతో చంద్రబాబు వర్చువల్ సమావేశం
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లో చదువుతున్న విద్యార్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం
అంబేద్కర్ విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొంది కెనడాలో ఉంటున్న అనిల్, ఆస్ట్రేలియాలో ఉంటున్న స్వర్ణలతతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు
-
2025-04-14T12:47:29+05:30
రేపు సీఎల్పీ భేటీ
రేపు సీఎల్పీ భేటీ కానుంది.
దీనిలో ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించనున్నారు.
భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, సన్న బియ్యం అంశాలపై చర్చించనున్నారు.
-
2025-04-14T12:47:28+05:30
ముఖ్యమంత్రితో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశామయ్యింది.
ఎస్సీ వర్గీకరణ జీవోను ముఖ్యమంత్రికి అందించిన సబ్ కమిటీ.