-
-
Home » Mukhyaamshalu » Today Breaking News and Andhra Pradesh Assembly Session Starts March 2025 Live Updates in Telugu News Siva
-

Breaking News: విష్ణు ప్రియా స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు..
ABN , First Publish Date - Mar 20 , 2025 | 10:23 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-20T13:43:46+05:30
బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించిన ఫిల్మ్‌ఛాంబర్.
సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలి.
ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదు.
ఫిల్మ్‌ఛాంబర్, 'మా' నుంచి లేఖ రాయాలని నిర్ణయించాం.
యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన.. రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలి.
ఫిల్మ్‌ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్.
-
2025-03-20T13:42:07+05:30
విష్ణు ప్రియా స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్న విష్ణు ప్రియ.
మొత్తం 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన విష్ణు ప్రియ.
ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేసిన విష్ణు ప్రియ.
ఇప్పటికే విష్ణు ప్రియ బ్యాంకు స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు.
మరోవైపు విష్ణుప్రియ మొబైల్ సీజ్ చేసిన పోలీసులు.
-
2025-03-20T13:36:20+05:30
భారీ ఎన్‌కౌంటర్.. 29 మంది మావోలు మృతి..
బీజాపూర్ మరొకసారి భారీ ఎన్కౌంటర్ ఎన్‌కౌంటర్.
కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి.
బీజాపూర్, దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు జాయింట్ టీమ్ బయలుదేరింది.
ఆపరేషన్ సమయంలో, ఈరోజు, 20/03/2025 ఉదయం 07 గంటల నుండి మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరుగుతున్నాయి.
ఎన్‌కౌంటర్ స్థలం నుండి భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
బీజాపూర్ DRGకి చెందిన ఒక సైనికుడు ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందాడు.
ప్రాంతంలో ఎన్‌కౌంటర్, సోదాలు కొనసాగుతున్నాయి.
-
2025-03-20T13:34:25+05:30
బండి సంజయ్‌పై కేసును కొట్టేసిన హైకోర్టు.
2020 నవంబర్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదు.
కార్యకర్తల సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కేసు నమోదు.
సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌లో కేసు నమోదు.
చార్జ్‌షీట్ దాఖలు చేసిన మార్కెట్ పీఎస్ పోలీసులు.
ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న బండి సంజయ్ తరఫు న్యాయవాది.
సాక్ష్యుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయన్న న్యాయవాది.
సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్న న్యాయవాది.
బండి సంజయ్‌పై కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించిన హైకోర్టు.
-
2025-03-20T12:43:44+05:30
ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో చర్చ..
అమరావతి: ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ప్రారంబించిన ఎంఎల్ఏ నక్కా ఆనంద్ బాబు.
2026 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌లో జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని కోరిన ఆనందబాబు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కు కట్టుబడి ఉందని పేర్కొన్న ఆనంద్ బాబు.
-
2025-03-20T12:11:24+05:30
అమెరికాలో మరో భారతీయ వ్యక్తిపై బహిష్కరణ వేటు
హమాస్ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో..
భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్ సూరి అరెస్ట్
సూరిని త్వరలోనే భారత్‌కు తిరిగి పంపించేందుకు..
ప్రయత్నిస్తున్నామని ప్రకటించిన అధికారులు
ఈ చర్యలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన సూరి
వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో రీసెర్చర్‌గా ఉన్న సూరి
సోమవారం అర్ధరాత్రి వర్జినీయాలో సూరి అరెస్ట్
వీసా కూడా రద్దు చేసినట్లు డీహెచ్‌ఎస్ ప్రకటన
ఇటీవల ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే..
భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ స్వీయ బహిష్కరణ
-
2025-03-20T11:06:04+05:30
ఛత్తీస్‌గడ్: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.
మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆండ్రి అడవుల్లో జరిగిన ఘటన.
భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కోనసాగుతున్న ఎదురు కాల్పులు.
-
2025-03-20T10:42:23+05:30
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.
కేంద్ర ప్రాయోజిత పధకాలపై ప్రశ్న.
రూ. 7200 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు చూపిచారు: దూళిపాళ నరేంద్ర, ఎమ్మెల్యే
12-06-2024 నాటికి ఉన్నట్టు చూపారు.
జూన్ 12 నాటికి చూపించిన దానికంటే కొన్ని కాంపోనెంట్స్ లో ఎక్కువ విడుదల చేశారు.
పంచాయితీరాజ్, రూరల్ డెవలెప్మెంట్ అయితే ఇవ్వాల్సింది వెయ్యి కోట్లు అయితే 1800 కోట్లు రిలీజ్ చేశారు.
గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేశారు.
-
2025-03-20T10:28:36+05:30
దొంగల్లా వచ్చి వెళ్తున్నారు..
అమరావతి: వైసీపీ సభ్యులపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన.
కొంతమంది సభ్యులు దొంగల్లా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్నారు.
ఇది మంచి పద్ధతి కాదు.. రిజిస్టర్‌లో సంతకాలు చేసిన వారు ఎవరు నాకు సభలో కనిపించలేదు.
మిమ్ములను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారు.
మీకు దొంగచాటుగా రావలసిన అవసరం ఏముంది.
గవర్నర్ ప్రసంగం తరువాత 7 గురు వైసిపి సభ్యులు దొంగలు మాదిరిగా వచ్చి సంతకాలు పెట్టీ వెళ్ళిపోయారు.
నా దృష్టిలో వారికి అంతా అవసరం లేదు.
నేరుగా సభకు వచ్చి మాట్లాడవచ్చు కదా.
ప్రశ్నలు అడిగి కొంతమంది సభ్యులు సభలో లేకుండా వెళ్లిపోతున్నారు.
దీనివలన అసలు ప్రశ్నలు అడగాల్సిన సభ్యులు అవకాశం కోల్పోతున్నారు.
ఇటువంటి సంప్రదాయం మంచిది కాదు అన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసిన 7 గురి ఎంఎల్ఏల పేర్లు చదివిన స్పీకర్.
-
2025-03-20T10:26:23+05:30
పంజాబ్ శంభు సరిహద్దులో కొనసాగుతోన్న ఉద్రిక్తత
ఏడాది నుంచి శంభు-ఖనౌరి సరిహద్దు మూసివేసి..
కేంద్రానికి వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు
నిన్న రాత్రి రైతు నాయకుల దీక్ష భగ్నం, అరెస్ట్
ఉదయం నుంచి నిరసన స్థలాలను ధ్వంసం చేస్తున్న పోలీసులు
నిరసన తెలుపుతున్న ప్రాంతం నుంచి రైతులను ఖాళీ చేయించిన పోలీసులు
కాంక్రీట్ బారికేడ్లను బుల్డోజర్లతో తొలగిస్తోన్న అధికారులు
రైతులు వేసుకున్న గుడారాలు, టెంట్లను సైతం తొలగిస్తున్న పోలీసులు
శంభు-ఖనౌరి సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు
-
2025-03-20T10:23:16+05:30
Breaking News: ఏపీ అసెంబ్లీలో కొశ్చన్ అవర్ ప్రారంభం
ఏపీ అసెంబ్లీలో కొశ్చన్ అవర్ ప్రారంభం
ప్రశ్నోత్తరాలు ప్రారంభించిన స్పీకర్
ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, డ్యామ్‌లపై సభ్యుల ప్రశ్నలు