Share News

Viral Video: ఇదేందిరా మామ.. నీటి సంపా.. పాముల పుట్టా..

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:44 PM

నీటి సంపు ఓపెన్ చేయగానే భారీ సంఖ్యలో పాములు కనిపించాయి. ఇంటి ఓనర్ షాక్ అయ్యాడు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఇదేందిరా మామ.. నీటి సంపా.. పాముల పుట్టా..
Viral News

నీటి సమస్య ఉన్న వాళ్లు ఇంటి ఆవరణలో పెద్ద గొయ్యి తీసి.. దాన్ని ట్యాంకుగా మార్చి నీటిని స్టోర్ చేస్తూ ఉంటారు. దీన్నే నీటి సంపు అంటారు. ఓ సారి ఊహించుకోండి. మీరు నీటి కోసం ఆ సంపును ఓపెన్ చేశారు. అందులో కుప్పలు, తెప్పలుగా పాములు కనిపించాయి. మీ పరిస్థితి ఎలా ఉంటుంది?.. హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది కదూ.. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. నీటి కోసం సంపును ఓపెన్ చేయగా పెద్ద సంఖ్యలో పాములు దర్శనమిచ్చాయి. వాటిని చూసి అతడు షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని సివమొగ్గ సిటీ, కాశీపురలోని ఓ ఇంట్లో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


సివమొగ్గ సిటీలోని కాశీపురకు చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తి ఆదివారం ఉదయం నీటి సంపు దగ్గరకు వెళ్లాడు. నీటి సంపు డోర్ ఓపెన్ చెయ్యగా భారీ సంఖ్యలో చిన్న చిన్న పాము పిల్లలు నీటిపై తేలుతూ కనిపించాయి. దీంతో అతడు భయపడిపోయాడు. పాములు పట్టే కిరణ్ అనే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత కిరణ్ అక్కడికి చేరుకున్నాడు. మొదటి రోజు ఏకంగా 60 పాము పిల్లల్ని నీటి నుంచి బయటకు తీశాడు. మరుసటి రోజు 9 పిల్లల్ని బయటకు తీశాడు. వాటన్నింటిని నది దగ్గరలో విడిచిపెట్టాడు. పాముల గురించి కిరణ్ మాట్లాడుతూ.. ‘ ఇంట్లో 69 పాము పిల్లలు దొరికాయి. అవి 45 సెంటీమీటర్ల పొడువు ఉన్నాయి. అందులో ఓ తెల్లపాము కూడా ఉంది.


మార్చ్ నుంచి మే వరకు పాములు గుడ్లను పొదుగుతూ ఉంటాయి. కొన్ని పాములు ఈ టైంలోనే గుడ్లను పెడతాయి. పెట్టిన గుడ్లను పొదగడానికి కనీసం ఓ నెల సమయం పడుతుంది. సాధారణంగా పాము 80 గుడ్లను పెడుతుంది. పాము ఏ జాతితో తెలియకుండా గుడ్లను నాశనం చేయటం కానీ, వేరే చోట పెట్టడం కానీ, చేయకండి’ అంటూ ప్రజలకు విజ్ణప్తి చేశాడు. కిరణ్ నీటి సంపునుంచి పాములను బయటకు తీస్తున్న ద‌ృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ అన్ని పిల్ల పాములు అక్కడ ఉన్నాయంటే.. తల్లి పాము కూడా అక్కడే ఎక్కడో ఉంటుంది’..‘ ఆ పాములు పెరిగి పెద్దవయి ఉంటే ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి?.. ’అంటూ వాపోతున్నారు.


ఇవి కూడా చదవండి:

బిడ్డ వంటలు.. తల్లి తంటాలు..

KKR vs RR Prediction IPL 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్.. ఖాతా తెరిచేదెవరో..

Business Idea : రూ.4వేలు ఉంటే చాలు.. ఈ పనితో ఇంటి నుంచే ప్రతి నెలా రూ.85 వేలు గ్యారెంటీ..

Updated Date - Mar 26 , 2025 | 03:30 PM