Baba Ramdev: రాందేవ్ బాబాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:38 AM
ఔషధాలకు సంబంధించి పతంజలి సంస్థకు అనుబంధంగా ఉన్న దివ్వ ఫార్మసీ తప్పుదోవపట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ ఆ సంస్థ నిర్వాహకులైన రాందేవ్‌తో పాటు, ఆచార్య బాలకృష్ణలపై కేరళ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేసు పెట్టారు.

జారీ చేసిన కేరళలోని పాలక్కడ్ కోర్టు
తప్పుదోవ పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు
రాందేవ్, బాలకృష్ణపై కేసు నమోదు
ఈ నెల 1న కోర్టు విచారణకు గైర్హాజరు
15న ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు
తిరువనంతపురం, ఫిబ్రవరి 2: యోగా గురు బాబా రాందేవ్‌కు కేరళలో కోర్టు ఒకటి నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను విస్మరించినందుకు పాలక్కాడ్‌లోని జ్యడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటు కోర్టు-2 ఈ వారెంటు ఇచ్చింది. ఔషధాలకు సంబంధించి పతంజలి సంస్థకు అనుబంధంగా ఉన్న దివ్వ ఫార్మసీ తప్పుదోవపట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ ఆ సంస్థ నిర్వాహకులైన రాందేవ్‌తో పాటు, ఆచార్య బాలకృష్ణలపై కేరళ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేసు పెట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలంటూ గతంలో కోర్టు నోటీసులు ఇవ్వగా వారు దాన్ని అమలు చేయలేదు. దాంతో వారిని ఈ నెల 15న కోర్టులో ప్రవేశపెట్టాలంటూ శనివారం వారెంట్లు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి