Share News

మళ్లీ చిత్తుగా ఓడిన పాక్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:03 AM

పేసర్లు జాకబ్‌ డఫీ (4/20), జకారి ఫౌల్క్స్‌ (3/25) నిప్పులు చెరగడంతో.. పాకిస్థాన్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే...

మళ్లీ చిత్తుగా ఓడిన పాక్‌

నాలుగో టీ20లో 115 పరుగులతో కివీస్‌ గెలుపు

3-1తో సిరీస్‌ కైవసం

మౌంట్‌ మాంగనుయ్‌: పేసర్లు జాకబ్‌ డఫీ (4/20), జకారి ఫౌల్క్స్‌ (3/25) నిప్పులు చెరగడంతో.. పాకిస్థాన్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1తో సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన నాలుగో టీ20లో కివీస్‌ 115 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 220/6 స్కోరు చేసింది. ఫిన్‌ అలెన్‌ (50), బ్రేస్‌వెల్‌ (46 నాటౌట్‌), సీఫెర్ట్‌ (44) దూకుడుగా ఆడారు. హరీస్‌ రౌఫ్‌ మూడు, అబ్రార్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో కివీస్‌ పేసర్ల దెబ్బకు పాక్‌ 16.2 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్‌ సమద్‌ (44), ఇర్ఫాన్‌ ఖాన్‌ (24) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ డబుల్‌ డిజిట్‌ స్కోరు సాధించలేక పోయారు.

ఇవీ చదవండి:

రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 05:03 AM