India: చైనా ఉత్పత్తులపై భారత్ సుంకం
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:07 AM
వీటిలో సాఫ్ట్ ఫెర్రైట్ కోర్స్, వాక్యూమ్‌తో కూడిన ఫ్లాస్కులు, అల్యూమినియం ఫాయిల్స్, ట్రైక్లోరో ఐసోసైనారిక్ యాసిడ్, పాలీవినైల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్ ఉన్నాయి. వీటి మీద సుంకాలను టన్నుకు 276 డాలర్ల నుంచి అత్యధికంగా 1732 డాలర్ల వరకూ విధించారు.

చవక సరుకుల నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడటానికే నిర్ణయం
ఫ్లాస్కులు, అల్యూమినియం ఫాయిల్స్ సహా ఐదు రకాల ఉత్పత్తులకు వర్తింపు
న్యూఢిల్లీ, మార్చి 23: ఫ్లాస్కులు, పలచటి అల్యూమినియం రేకులు (ఫాయిల్స్) సహా మొత్తం ఐదు రకాల చైనా ఉత్పత్తులపై భారత్ యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చైనా నుంచి దిగుమతి అయ్యే చవక ఉత్పత్తుల నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించే లక్ష్యంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. వీటిలో సాఫ్ట్ ఫెర్రైట్ కోర్స్, వాక్యూమ్‌తో కూడిన ఫ్లాస్కులు, అల్యూమినియం ఫాయిల్స్, ట్రైక్లోరో ఐసోసైనారిక్ యాసిడ్, పాలీవినైల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్ ఉన్నాయి. వీటి మీద సుంకాలను టన్నుకు 276 డాలర్ల నుంచి అత్యధికంగా 1732 డాలర్ల వరకూ విధించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖకు చెందిన ‘పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల సెంట్రల్ బోర్డు’ వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. తాజా సుంకాలు అల్యూమినియం ఫాయిల్స్‌పై ఆర్నెళ్లపాటు, మిగిలిన ఉత్పత్తుల మీద ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని పేర్కొంది. పాలీవినైల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్ విషయంలో మాత్రం చైనాతోపాటు కొరియా, మలేషియా, నార్వే, తైవాన్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన వాటి మీద కూడా ఐదేళ్లపాటు నిషేధం ఉంటుందని తెలిపింది.