Mallu Bhatti Vikramarka: ఏఐసీసీ భేటీల ముసాయిదా కమిటీలో భట్టి
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:18 AM
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఈ కమిటీలో సభ్యుడిగా చేర్చారు, కన్వీనర్‌గా రన్‌దీ్‌ప సింగ్ సూర్జేవాలా నియమితుడయ్యారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ఏఐసీసీ సమావేశాలకు కాంగ్రెస్ అధిష్ఠానం ముసాయిదా కమిటీని నియమించింది. 15 మంది సీనియర్ నేతలతో కూడిన ఈ కమిటీలో.. సభ్యుడిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అధిష్ఠానం అవకాశం కల్పించింది. కమిటీకి కన్వీనర్‌గా రన్‌దీ్‌ప సింగ్ సూర్జేవాలా.. సభ్యులుగా జైరాం రమేశ్, తారీఖ్ అన్వర్, దీపా దాస్‌మున్షీ, భూపేశ్ భగల్, సచిన్ పైలట్, రజనీ పాటిల్, పీఎల్ పునియా, బీకే హరిప్రసాద్, గౌరవ్ గొగొయ్, మనీష్ తివారి, విజయ్, బెన్ని బెహనన్, విక్రాంత్ భురియా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News