Share News

Delhi Tihar Jail,: మరో ప్రాంతానికి తిహాడ్‌ జైలు తరలింపు

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:33 AM

ఢిల్లీలో జనావాస ప్రాంతానికి సమీపంగా ఉన్న తిహాడ్‌ జైలు కిక్కిరిసిపోవడంతో, దీన్ని నగర శివారు ప్రాంతమైన నరేలాకు మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త జైలు నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించింది.

Delhi Tihar Jail,: మరో ప్రాంతానికి తిహాడ్‌ జైలు తరలింపు

న్యూఢిల్లీ, మార్చి 25: తిహాడ్‌ జైలును నగర శివారు ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర ్ణయించింది. ఇందుకోసం రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం రేఖాగుప్తా మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. 1958లో స్థాపించిన ఈ జైలు దేశంలోనే అతి పెద్ద జైలు సముదాయాలలో ఒకటి. సుమారు 400 ఎకరాలలో విస్తరించిన ఈ జైలు దక్షిణ ఢిల్లీలోని జనావాస ప్రాంతాలైన తిలక్‌నగర్‌, హరినగర్‌ ప్రాంతాలకు సమీపంలో ఉంది. దాదాపు 10 వేల మంది ఖైదీలను ఉంచే ఏర్పాట్లు ఈ జైలులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం 19 వేల మంది ఖైదీలతో కిక్కిరిసిపోయింది. దీంతో జైల్లో భద్రతాసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించింది. అందుకే నరేలాలో కొత్త జైలును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:33 AM