CM Salary Hike: కర్ణాటకలో ప్రజాప్రతినిధుల వేతనాలు రెట్టింపు
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:22 AM
ప్రస్తుతం పెరిగిన ధరల భారంతో సామాన్య ప్రజల్లాగే ప్రజా ప్రతినిధులూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం వేతనం నెలకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు, మంత్రుల వేతనాలు రూ.60 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెరిగాయి. మరోవైపు..

బెంగళూరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సీఎం, మంత్రులు, శాసనసభ్యుల వేతనాలు 100ు పెంపు ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలిపింది. వేతనాల పెంపును హోంమంత్రి జి.పరమేశ్వర సమర్థించుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల భారంతో సామాన్య ప్రజల్లాగే ప్రజా ప్రతినిధులూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం వేతనం నెలకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు, మంత్రుల వేతనాలు రూ.60 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెరిగాయి. మరోవైపు.. ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు భారీగా వేతనాల పెంపు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే