Teachers: ‘కీచక టీచర్ల’ చిట్టా సిద్ధం..
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:36 PM
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న వేళ.. వారి భరతం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడే టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వారి విద్యార్హత కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది.

- పదేళ్లలో లైంగిక వేధింపుల ఆరోపణలున్న టీచర్ల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
- నిరూపణ అయితే ఉద్యోగం నుంచి డిస్మిస్.. విద్యార్హతల రద్దు
- మార్చి నుంచి అమలుకు విద్యాశాఖ నిర్ణయం
చెన్నై: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న వేళ.. వారి భరతం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడే టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వారి విద్యార్హత కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది. గత పదేళ్లలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న టీచర్ల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Prashant Kishore: టీవీకే నేతలతో పీకే భేటీ.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చ
ముఖ్యంగా కృష్ణగిరి జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఆ ఉపాధ్యాయులను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించగా, పాఠశాల విద్యాశాఖ ఆ ముగ్గరుని డిస్మిస్ చేసింది. అదే విధంగా తిరుచ్చి, ఈరోడ్, హోసూరు, శివగంగ(Trichy, Erode, Hosur, Shivaganga) సహా పలు ప్రాంతాల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారనే వార్తలు ఇటీవల వెలుగుచూడడంతో ఈ విషయం తీవ్రరూపం దాల్చింది. విద్యార్థులు పాఠశాలల్లో సురక్షితంగా ఉంటారని భావిస్తున్న తల్లిదండ్రులు, విద్యా వేత్తల్లో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఉపాధ్యాయులను డిస్మిస్ చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.
కఠిన చర్యలు...
రాష్ట్రవ్యాప్తంగా పదేళ్లలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుల జాబితా సేకరిస్తున్నారు. ఫిర్యాదులు, శాఖాపరమైన చర్యలు, కేసులు, విచారణ కమిటీ నివేదిక, శిక్ష విధింపబడినవి, పెండింగ్‌లో, విచారణలో ఉన్నవి, కేసులు ఎదుర్కొంటూ ఇంకా విధుల్లో ఉన్నవారు తదితర వివరాలను తీసుకుంటున్నారు. ప్రాథమిక విద్యాశాఖలో 80 మంది, పాఠశాల విద్యాశాఖలో 175 మంది చొప్పున మొత్తం 255 మంది జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. తప్పు చేసిన ఉపాధ్యాయులపై ఆర్డినెన్స్ 121 ప్రకారం తొలగించే అవకాశముంది. త్వరలోనే దీనికి సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
రుజువైతే విద్యార్హత రద్దు....
లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఆరోపణ నిజమని తేలితే సంబంధిత ఉపాధ్యాయుల విద్యార్హత రద్దు చేస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా లైంగిక ఫిర్యాదులకు పాల్పడిన ఉపాధ్యాయుల జాబితా, వారిపై తీసుకున్న చర్యలను నివేదిక సమర్పించాలని ఆ శాఖ డైరెక్టర్లకు ఉత్తర్వులందినట్లు సమాచారం. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ... విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
అలాంటి వాటికి స్వస్తి పలికి విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, ఘటనలకు బాధ్యులైన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు కఠినతరం చేయాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని 2012లో ఆర్డినెన్స్ (121) జారీ చేసిందని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళిలోని 19 (2) ఉపాధ్యాయులకు వర్తిస్తుందన్నారు. అయితే వివిధ కారణాలతో ఈ ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు అమలుచేసేలా చర్యలు చేపట్టామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి
ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News