Share News

Stock Market Opening Bell: లాభాల్లో దూసుకెళ్తోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Apr 02 , 2025 | 09:25 AM

Share Market Updates: నిన్న భారీ నష్టాలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ పాజిటివ్ ట్రెండ్ సూచిస్తున్నాయి.

Stock Market Opening Bell: లాభాల్లో దూసుకెళ్తోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు
stock market

Stock Market Opening Bell: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ నష్టాలతో మొదలు పెట్టిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ఉదయం భారత స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ఓపెన్(గ్యాప్ అప్) అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు గ్రీన్ లో మొదలయ్యాయి. మార్కెట్ మొదలైన ఉదయం 9:20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 185 పాయింట్లు.. నిఫ్టీ (Nifty) 50 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్లు, ఫిన్ నిఫ్టీ 115 పాయింట్లు, బ్యాంకెక్స్ 250 పాయింట్ల లాభంతో కదలాడుతున్నాయి.


అమెరికా మార్కెట్లు నిన్న డౌజోన్స్ మినహా లాభాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.36 శాతం , యూఎస్ టెక్ 100 సూచీ 0.97 శాతం లాభంతో క్లోజ్ అయింది. ఈ ఉదయం 9.20 గంటల ప్రాంతంలో యూఎస్ 30 ఇండెక్స్ 0.17 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇక యూరప్ మార్కెట్లన్నీ నిన్న లాభాలతో ముగిశాయి. ఇక ఇవాళ ఆసియా మార్కెట్లు లాభాలతో నడుస్తున్నాయి. జపాన్‌ నిక్కీ 0.11 శాతం, హాంకాంగ్‌ హాంగెసెంగ్‌ 0.36 శాతం లాభంతో కదలాడుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.68 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.03 శాతం పెరిగి 73.76 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

రాబడికి నూతన మార్గాలు

యువకుడిపై పెట్రోల్‌ పోసి..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 02 , 2025 | 10:58 AM