PM Modi: చెట్టు కింద విద్యార్థులతో మోదీ ముచ్చట్లు.. పిల్లల భవిష్యత్తును ఆప్ నాశనం చేస్తోందన్న ప్రధాని
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:38 PM
ఢిల్లీ విద్యార్థులతో మోదీ సోమవారంనాడు ముఖాముఖీ సంభాషించారు. ఆప్ విద్యా విధానంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తోందని ఆక్షేపణ తెలిపారు.

న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తు కంటే సొంత ప్రతిష్టను పెంచుకునేందుకే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును ఆప్ నాశనం చేస్తోందని అన్నారు. ఢిల్లీ విద్యార్థులతో మోదీ సోమవారంనాడు ముఖాముఖీ సంభాషించారు. ఆప్ విద్యా విధానంపై విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi: దేశంలో మకాం వేసిన చైనా: రాహుల్ గాంధీ
''తొమ్మిదవ తరగతి దాటి చదివేందుకు ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులను వాళ్లు (ఆప్ ప్రభుత్వం) అనుమతించడం లేదని విన్నాను. పాస్ గ్యారెంటీ అనుకున్న వాళ్లనే పైతరగతులకు పంపిస్తున్నారని తెలిసింది. సరైన రిజల్ట్స్ రాకపోతే ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారు. ఇది విద్యావ్యవస్థలో నిజాయితీ లోపించడమే అవుతుంది" అని విద్యార్థులతో ప్రధాని అన్నారు. 9,11 తరగతుల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందంటూ గతంలో పలు కథనాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అభివృద్ధి గాలులు వీస్తున్నాయి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియనుండటంతో ప్రధానమంత్రి గత కొద్దిరోజులుగా వరుస ర్యాలీల్లో పాల్గొంటూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ ప్రచారం సాగించారు. ఆదివారంనాడు ఆర్కే పురం ర్యాలీలో వసంత పంచమి రాకతో వాతావరణంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, ఢిల్లీలో మరికొద్ది రోజుల్లో అభివృద్ధి గాలులు వీచనున్నాయని అన్నారు. ఈసారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. ఆప్ ప్రభుత్వం 11 ఏళ్లు వృథా చేసిందని, ఢిల్లీ ప్రజలకు సేవ చేసే ఒక్క అవకాశం తమకు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్య పరిష్కారానికైనా తాను వెనుకాడేదని లేదని హామీ ఇచ్చారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. ఒక్క మురికివాడను కూడా కూల్చే ప్రసక్తి లేదని, మురికివాడల్లో నివసించే వారికి కేవలం రూ.5కే పూర్తి పోషకాహారం అందిస్తామని, అటోడ్రైవర్లు, డొమిస్టిక్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను కొనసాగస్తామని హామీ ఇచ్చారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూాడ చదవండి..
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి