Trains: సికింద్రాబాద్-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:40 PM
ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్(Secunderabad - Ramanathapuram - Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకారం, నెం.07695 సికింద్రాబాద్-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: Slouch Caps: స్లోచ్ క్యాప్.. ఇక కనపడదు..
మరుమార్గంలో, నెం.07696 రామనాథపురం-సికింద్రాబాద్(Ramanathapuram - Secunderabad) ప్రత్యేక రైలు ఈ నెల 4,11,18,25,మే 2వ తేదీల్లో రామనాథపురంలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్(Secunderabad) చేరుకుంటుంది. ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News