Share News

చెన్నయ్య భూమి హాంఫట్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:16 AM

దేవాలయాల భూముల ఆక్రమణలు మార్కాపురం డివిజన్‌లో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఆలయ భూములను కబ్జా చేసి అమ్ముకునేది కొందరైతే వ్యవసాయ క్షేత్రాలను ఆనుకుని ఉన్న మాన్యాలను ఇష్టారీతిన కలిపేసుకునేవాళ్లు మరికొందరు ఉన్నారు.

చెన్నయ్య భూమి హాంఫట్‌
ఆక్రమణకు గురైన ఆలయ భూమి

11.67 ఎకరాలు ఆక్రమణ

దాని విలువ రూ.5 కోట్లు!

వ్యవసాయ భూమిలో కలిపేసుకున్న కబ్జాదారులు

చోద్యంచూస్తున్న అధికారులు

మార్కాపురం, మార్చి 31 (ఆంధ్ర జ్యోతి): దేవాలయాల భూముల ఆక్రమణలు మార్కాపురం డివిజన్‌లో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఆలయ భూములను కబ్జా చేసి అమ్ముకునేది కొందరైతే వ్యవసాయ క్షేత్రాలను ఆనుకుని ఉన్న మాన్యాలను ఇష్టారీతిన కలిపేసుకునేవాళ్లు మరికొందరు ఉన్నారు. ఒక వైపు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి దేవుని భూములను ఒక్కొక్కటిగా ఆక్రమణల చెర నుంచి విడిపిస్తోంది. అయినా కబ్జాలకు అలవాటుపడ్డ వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అక్రమణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆలయాల ఆస్తులను పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం భూ బకాసురులకు వరంగా మారుతోంది. దీంతో దేవుని భూములు ఇష్టారీతిన అన్యాక్రాంత మవుతున్నాయి. ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలేనికి చెందిన చెన్నకేశవస్వామి ఆస్తులు కూడా ఇదేవిధంగా కబ్జాదారుల కంబంధ హస్తాల్లో ఉన్నాయి. పెద్దారవీడు మండలంలో రూ.5 కోట్ల విలువైన 11.67 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.

రికార్డులున్నా.. ఆక్రమణల చెరలోనే

పెద్దారవీడు మండలంలోని కంభంపాడు గ్రామ సర్వేనంబరు 35లో 4.31 ఎకరాలు, సర్వేనంబర్‌ 75లో 7.36 ఎకరాలు వెరసి 11.67 ఎకరాలు వెంకటాద్రిపాలెం చెన్నకేశవస్వామి దేవస్థానానికి చెందిన భూమి ఉంది. అవి రెవెన్యూ రికార్డుల్లో కూడా దేవస్థానానికి చెందిన భూములుగానే నమోదయ్యాయి. ఖాతా నెంబర్‌ 721లో ఈ భూములు దేవదాయశాఖ పేరుతోనే ఉన్నాయి. కానీ అదేగ్రామానికి చెందిన కొందరు రైతులు ఈ భూములపై కన్నేశారు. దేవస్థానం భూముల చుట్టూ పట్టా భూములున్న రైతులే దాదాపు 10 ఎకరాల మేర అక్రమించి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం ఆ భూమి విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. అక్రమంగా తమ భూములకు దేవదాయశాఖకు పట్టాదారు పాసుపుస్తుకాలు ఇచ్చారని రెవెన్యూ అధికారులపై రైతులు కోర్టు ్జకెక్కారు. తద్వారా భూమిని దశాబ్దాలుగా నిరాటంకంగా సాగు చేసుకుంటున్నారు. ఈ విషయమై ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డిని వివరణ కోరగా ఆ గ్రామంలోని 11.37 ఎకరాల భూమి వెంకటాద్రిపాలెం చెన్నకేశవస్వామికి చెందినదేనన్నారు. అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు పాస్‌ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. తప్పకుండా ఆ భూమికి ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పించి స్వాఽధీనం చేసుకుంటామన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 01:16 AM