జియో ట్యాగింగ్‌తో ఇళ్ల వద్దే పెన్షన్లు
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:21 AM
అమలాపురం రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ అందించాలనే లక్ష్యంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జిల్లా ఇన్‌చార్జి అధికారి పి.రవిసుభాష్ పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణతో ప్రజా సంతృప్తే లక్ష్యంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. క్షేత్ర స్థాయిలో అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశిం

ప్రజా సంతృప్తే లక్ష్యంగా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ
జిల్లా ఇన్‌చార్జి అధికారి రవిసుభాష్
అమలాపురం రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ అందించాలనే లక్ష్యంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జిల్లా ఇన్‌చార్జి అధికారి పి.రవిసుభాష్ పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణతో ప్రజా సంతృప్తే లక్ష్యంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. క్షేత్ర స్థాయిలో అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం అమలాపురం రూరల్ మండల పరిధిలోని సవరప్పాలెంలో ఇంటింటికీ వెళ్లి ఉద్యోగులు సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఫేషియల్ యాప్‌లో నమోదు, అక్విడెన్స్ స్వీకరణ ప్రక్రియలను ఆయన తనిఖీచేసి పంపిణీపరంగా జరుగుతున్న చిన్నచిన్న లోపాలను గుర్తించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయిలను అడిగి తెలుసుకున్నారు. నూ రు శాతం నాణ్యత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంతృప్తే కొలమానం గా వివిధ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తూ ఐవీ ఆర్‌ఎస్ తదితర విధానాల ద్వారా లబ్ధిదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా జిల్లాలకు గ్రేడ్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2,35,887 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా, వీరికి రూ. 100.90 కోట్ల నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తొలిరోజు వివిధ కారణాలతో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే రెండో రోజు ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేయాల్సివస్తే తగిన కారణాన్ని ఎన్టీఆర్ భరోసా మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు.ప్రతీ లబ్ధిదారునికి సీఎం సంక్షిప్త సందేశాన్ని ముందుగా వినిపించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సాయినాథజైచంద్రగాంధీ, ఎంపీడీవో ఉండ్రు బాబ్జిరాజు, డీపీఎం ఏవీఎల్ అన్నపూర్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.