లొల్లలాకుల ఆధునికీకరణకు రూ.72 కోట్లతో ప్రతిపాదనలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:19 AM
ఆత్రేయపురం, ఏప్రిల్1 (ఆంధ్రజ్యోతి): కోన సీమ జిల్లాలోని పదహారు మండలాల పరిధిలో రెండు లక్షల ఆయకట్టుకు సాగునీరందిస్తున్న లొల్లలాకుల వ్యవస్థను రూ.72 కోట్లతో పునః నిర్మించేందుకు విశేష కృషిచేస్తున్నట్టు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగ ళవారం లొల్లలాకులు వద్ద డిస్ట్రిబ్యూ

ఎమ్మెల్యే బండారు
ఆత్రేయపురం, ఏప్రిల్1 (ఆంధ్రజ్యోతి): కోన సీమ జిల్లాలోని పదహారు మండలాల పరిధిలో రెండు లక్షల ఆయకట్టుకు సాగునీరందిస్తున్న లొల్లలాకుల వ్యవస్థను రూ.72 కోట్లతో పునః నిర్మించేందుకు విశేష కృషిచేస్తున్నట్టు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగ ళవారం లొల్లలాకులు వద్ద డిస్ట్రిబ్యూటరీ కమి టీ, సాగునీటి సంఘాలతో సమావేశం నిర్వ హించారు. సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సెంట్రల్‌డెల్టా పరిధిలో వ్యవసాయాధారంగా జీ విస్తున్నారని, తద్వారా సాగునీటిపై ఆధారపడి ఉన్నందున లొల్ల లాకులను ఆధునికీకరించడం ద్వారా సెంట్రల్ డెల్టాలోని శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. ఆధునికీకరణకు సీఎం చంద్రబాబునాయుడు, ఆ శాఖామంత్రి నిమ్మల రామానాయుడులను కలిసి ఇప్పటికే వివరించడం జరిగిందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు రైతాంగ సమస్యలపై పూర్తి సహకారం అందిస్తున్నార న్నారు. అలాగే కోనసీమలో ఏకో టూరిజం అభివృద్ధి చర్యలు చేపట్టడం జరుగు తుందన్నారు. అనంతరం సాగునీటి సంఘాల అధ్యక్షులను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్ర మంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీని వాస్, సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్‌రాజు, ముదునూరి వెంకటరాజు, ముళ్ల పూడి భాస్కరరావు, కాయల జగన్నాథం, బం డారు వీరబాబు, చవ్వల జగన్నాఽథం, మెర్ల గో పాలం, కంటంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
బండారు రూ.5 లక్షల విరాళం..
పర్యాటకులను ఆకర్షిస్తున్న లొల్ల లాకులను పార్కులా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బండారు అన్నారు. లాకుల వద్ద పచ్చని వనంలా తీర్చి దిద్దేందుకు సంస్థలు, నేతలు, అధికారులు సమ న్వయంతో దాతల సహకారం తీసుకుని అభివృ ద్ధి చేయాలన్నారు. ఇందుకోసం రూ.5 లక్షలు వి రాళంగా అందిస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.